ETV Bharat / sports

'ఆ నిర్ణయం సరికాదు.. సచిన్‌ను 200 కొట్టనివ్వాల్సింది' - సచిన్​ తెందూల్కర్​

Yuvraj Singh on Multan declaration: పాకిస్థాన్​లో 3 టెస్టుల సిరీస్​ కోసం 2004లో ఆ దేశంలో పర్యటించింది టీమిండియా. ముల్తాన్​ టెస్టులో క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ 194 వద్ద ఇన్నింగ్స్​ డిక్లేర్​ చేసింది జట్టు. అయితే.. సచిన్​ను ద్విశతకం కొట్టనివ్వాల్సిందని మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ తాజాగా వెల్లడించాడు. జట్టు నిర్ణయం సరైంది కాదని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.

sachin tendulkar
సచిన్​ తెందూల్కర్
author img

By

Published : May 7, 2022, 12:48 PM IST

Yuvraj Singh on Multan declaration: 2004లో పాకిస్థాన్‌తో జరిగిన ముల్తాన్‌ టెస్టులో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను ద్విశతకం కొట్టనివ్వాల్సిందని మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మాజీ ఆల్‌రౌండర్‌.. నాటి టెస్టులో జరిగిన ఆసక్తికర విషయంపై తొలిసారి స్పందించాడు. అప్పుడు జట్టు తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నాడు. 3 టెస్టుల సిరీస్‌ కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన భారత్‌ 2-1 తేడాతో గెలుపొంది తొలిసారి దాయాది గడ్డపై టెస్టు సిరీస్‌ నెగ్గింది. ముఖ్యంగా ముల్తాన్‌లో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించింది.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 675/5 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ (309; 375 బంతుల్లో 39x4, 6x6) త్రిశతకం సాధించి భారత టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అదే సమయంలో సచిన్‌ తెందూల్కర్‌ (194 నాటౌట్‌; 348 బంతుల్లో 21x4) ద్విశతకానికి చేరువైన వేళ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడం కూడా తెలిసిందే. అయితే, ఈ విషయం అప్పట్లోనే సంచలనంగా మారింది. తెందూల్కర్‌ డబుల్‌ సెంచరీ సాధించకుండా ద్రవిడ్‌ అలా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడని క్రికెట్‌ పండితులే ఆశ్చర్యపోయారు. ఇదే విషయంపై యువరాజ్‌ తాజాగా నోరు విప్పాడు. అప్పుడు సచిన్‌ను ద్విశతకం చేయనివ్వాల్సిందని అన్నాడు.

" ఆరోజు నేనూ, సచిన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేస్తున్నామని, వేగంగా పరుగులు చేయాలని జట్టు నుంచి సందేశం వచ్చింది. అప్పుడు సచిన్‌ ఇంకో ఓవర్‌ ఆడి ఉంటే ఆ 6 పరుగులూ పూర్తి చేసి ద్విశతకం సాధించేవాడు. మేం ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాక 8-10 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేశాం. కానీ, సచిన్‌ 194 పరుగుల వద్ద ఉండగా ఇంకో రెండు ఓవర్లు ఆడి ఉంటే అది మ్యాచ్‌పై పెద్ద ప్రభావం చూపేది కాదని నేననుకుంటా. అయితే, ఆ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నేను మాత్రం సచిన్‌ 200 కొట్టాక ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసుంటే బాగుండేదని అనుకున్నాను"

- యువరాజ్‌ సింగ్​

ఆ మ్యాచ్‌లో తర్వాత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్​ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్‌ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలిసారి పాకిస్తాన్​ గడ్డపై టెస్టు సిరీస్​ నెగ్గి తమ సత్తా చాటింది టీమిండియా.

ఇదీ చూడండి: 17 సిక్స్​లు, 8 ఫోర్లతో 'స్టోక్స్'​ వీరబాదుడు.. ఒక్క ఓవర్లోనే 34 పరుగులు

'హిట్​ మ్యాన్'కు తోడుగా మరో క్రికెటర్​.. ఐపీఎల్​లో 14 సార్లు డకౌట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.