ETV Bharat / sports

మెరిసిన కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌.. ప్లేఆఫ్స్‌లో ముంబయి - గుజరాత్​పై ముంబయి గెలుపు

మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గుజరాత్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో డబ్ల్యూపీఎల్‌లో ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది.

wpl 2023
wpl 2023
author img

By

Published : Mar 14, 2023, 11:10 PM IST

Updated : Mar 15, 2023, 6:38 AM IST

మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబయి-గుజరాత్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్​లో ముంబయి 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే ఈ మెగాటోర్నీలో నాలుగు విజయాలను దక్కించుకున్న ఆ టీమ్​.. ఇప్పుడు తన ఐదో మ్యాచ్‌లోనూ గెలిచింది. ఈ విజయంతో డబ్ల్యూపీఎల్‌లో ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్​.. నిర్ణీత 20 ఓవర్లలో 107 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్లలో హర్నిల్(22) టాప్​ స్కోరర్​. నాట్‌ సీవర్‌ (3/21), హేలీ మాథ్యూస్‌ (3/23), అమేలియా కెర్‌ (2/18)ల దెబ్బకు గుజరాత్‌ అస్సలు కోలుకోలేకపోయింది. తొలి ఓవర్లోనే సోఫియా డంక్లీ (0)ను పేసర్‌ నాట్‌ సీవర్‌ ఔట్ చేసింది. అలా గుజరాత్ పతనం మొదలైంది. స్పిన్నర్లు హేలీ, అమేలియాలు కూడా రెచ్చిపోయారు. వికెట్లు పడగొడుతూ గుజరాత్​ను బెంబేలెత్తించారు. దీంతో సబ్బినేని మేఘన (16), హర్లీన్‌ డియోల్‌ (22), స్నేహ్‌ రాణా (20) కాసేపే రాణించారు. అలా మొత్తంగా గుజరాత్​ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులే చేసింది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ముంబయి జట్టులో హర్మన్‌ప్రీత్‌ (51; 30 బంతుల్లో 7×4, 2×6), యాస్తిక భాటియా(44; 37 బంతుల్లో 5×4, 1×6), నాట్‌ సీవర్‌(36; 31 బంతుల్లో 5×4, 1×6) అదరగొట్టారు. తొలి ఓవర్లోనే హేలీ మాథ్యూస్‌ (0) వికెట్‌ కోల్పోయినా.. అనంతరం ఇన్నింగ్స్‌ సాఫీగానే ముందుకు సాగింది. ఓపెనర్‌ యాస్తికతో కలిసి నాట్‌ సీవర్‌ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. యాస్తిక కూడా బౌండరీలు బాదుతూ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే 11వ ఓవర్​లో సీవర్‌ ఔటైంది. ఆ సమయానికి ఆ జట్టు స్కోరు 75. అనంతరం కాసేపటికే హర్మన్‌ప్రీత్‌తో సమన్వయ లోపంతో యాస్తిక రనౌట్​గా వెనుదిరిగింది. అలా 84/3తో ముంబయి కాస్త ఇబ్బందుల్లో పడినట్లు కనిపించినా.. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్‌ రెచ్చిపోయి ఆడడంతో ఆ జట్టు వేగం పుంజుకుంది. ఆష్లీ గార్డ్‌నర్‌ ధాటికి ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ.. హర్మన్‌ అదిరిపోయే భారీ షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు పరుగెత్తించింది. ఆమె 29 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ బాదడంతో ముంబయి స్కోరు 150 దాటేసింది. అలా మొత్తంగా ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లలో ఆష్లీ గార్డ్‌నర్‌ (3/34) బాగా ఆకట్టుకుంది. కిమ్‌ గార్త్, స్నేహ్‌ రాణా, తనుజ కన్వర్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇదీ చూడండి: నా తప్పులే నన్ను సెంచరీకి దూరం చేశాయి.. నేను రికార్డుల కోసం ఆడను : కోహ్లీ

Last Updated : Mar 15, 2023, 6:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.