ETV Bharat / sports

WPL 2023: గేల్​, రైనా స్టైల్​లో హర్మన్​ ప్రీత్​.. వరుసగా 7 ఫోర్లు - హర్మన్ ప్రీత్ కౌర్ ముంబయి ఇండియన్స్​

డబ్ల్యూపీఎల్​ తొలి సీజన్​ ఆరంభ మ్యాచ్​లో గుజరాత్​ జట్టుపై ముంబయి కెప్టెన్​ హర్మన్ ప్రీత్ కౌర్​ బౌండరీల వర్షం కురిపించింది. వరుసగా తాను ఎదుర్కొన్న ఏడు బంతులను ఫోర్లుగా మలిచింది. గతంలో క్రిస్‌గేల్, సురేశ్ రైనా మాత్రమే ఇలాంటి ప్రదర్శన చేశారు.

Harman preet kaur seven fours
గేల్​, రైనా స్టైల్​లో హర్మన్​ ప్రీత్​.. వరుసగా 7 ఫోర్లు
author img

By

Published : Mar 5, 2023, 10:07 AM IST

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో ముంబయి ఇండియన్స్ శుభారంభం చేసింది. శనివారం రాత్రి ముంబయిలోని డీవై పాటిల్​ స్టేడియం వేదికగా జరిగిన ఆరంభ మ్యాచ్​లో గుజరాత్​ జెయింట్స్​ను చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా చెప్పాలంటే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(65) ధనాధన్ ఇన్నింగ్స్​తో బౌండరీల వర్షం కురిపించింది. 30 బంతులాడిన ఆమె ఏకంగా 14 ఫోర్లు బాది 65 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్​ ధాటికి తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. దీంతో హర్మన్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచింది.

కాగా, ఈ మ్యాచ్‌లో క్రీజులోకి వచ్చినప్పటి నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ బౌండరీలతో విజృంభించింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్​ హర్మన్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్​ హర్మన్‌.. ఓ దశలో తాను ఎదుర్కొన్న ఏడు బంతుల్ని వరుసగా ఫోర్లుగా మలిచింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్​లో మోనికా పటేల్ వేసిన బౌలింగ్‌లో చివరి నాలుగు బంతుల్ని వరుసగా 4,4,4,4 బాదింది. అదే ఓవర్‌లో ఓ బౌండరీ కూడా బాదడం వల్ల మొత్తం 21 రన్స్​ వచ్చాయి. ఆ తర్వాత ఇన్నింగ్స్ 16వ ఓవర్ గార్డ్‌నర్ వేసిన బౌలింగ్‌లోనూ హర్మన్‌ప్రీత్ వరుసగా 4,4,4 ధనాధన్ బాదింది. ఈ క్రమంలోనే కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకుని ఆకట్టుకుంది.

అంతకుముందు ఐపీఎల్‌లో క్రిస్‌ గేల్, సురేశ్ రైనా మాత్రమే ఇలాంటి ప్రదర్శనను చేశారు. అయితే వారు వరుసగా ఏడు బంతుల్ని ఫోర్​గా మలవలేదు. వరుస ఏడు బంతులను ఫోర్ లేదా సిక్స్‌గా మలిచారు. 2011లో కొచ్చి టస్కర్స్ టీమ్​పై క్రిస్‌గేల్ ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లు బాది 37 పరుగులు చేశాడు. ఇక 2014లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్​ సురేశ్ రైనా లైన్​గా ఏడు బాల్స్​లో రెండు సిక్సర్లు, ఐదు ఫోర్లు బాదాడు. కానీ వరుసగా ఏడు ఫోర్లు ఎవరూ బాదలేదు. తాజాగా ఆ మార్క్​ను హర్మన్‌ప్రీత్ కౌర్ అందుకుని అందరీ దృష్టిని ఆకర్షించింది.

ఇకపోతే ఈ మ్యాచ్​లో ముంబయి ధనాధన్​ దంచికొట్టడంతో 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది గుజరాత్​. కానీ ముంబయి బౌలర్లు కూడా విజృంభించడంతో ఛేదనలో గుజరాత్​ చతికిల పడింది. 64 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ముంబయి టీమ్​ 143 పరుగుల తేడాతో గెలిచి డబ్ల్యూపీఎల్ 2023లో బోణీ కొట్టింది.

ఇదీ చూడండి: అప్పుడే మరో సానియాను చూడగలం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.