Worldcup 2022 Ind vs Aus: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులను ప్రత్యర్థి ముందు ఉంచారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీ సేన.. ఆదిలోనే తడబడింది. స్మృతి మంధాన(10), షఫాలీ వర్మ(12) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత బరిలోకి దిగిన యస్తికా భాటియా(59), మిథాలీ రాజ్(68) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. చివర్లో హర్మన్ ప్రీత్ కౌర్(57), పూజా వస్త్రకార్ మెరుపులతో భారత్.. మెరుగైన స్కోరు చేసింది.
కాగా, టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఆసిస్ జట్టు పదునైన బౌలింగ్‌తో రెచ్చిపోయింది. డార్సీ బ్రౌన్ మూడు వికెట్లు పడగొట్టింది. అలనా కింగ్ రెండు వికెట్లు సాధించింది.
జులన్ 200 వన్డేలు..
టీమ్ఇండియా పేసర్ జులన్ గోస్వామి మరో మైలురాయిని దాటింది. 200 వన్డేలు ఆడిన రెండో క్రీడాకారిణిగా రికార్డ్ సృష్టించింది. తాజాగా ఆస్ట్రేలియా వన్డేతో జులన్ ఈ ఫీట్ సాధించింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌గా జులన్ గోస్వామి రికార్డ్‌లో నిలిచింది.
అత్యధిక వన్డేల జాబితాలో టీమ్ఇండియా పేసర్ మిథాలీ రాజ్(230 వన్డేలు) మొదటి స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ షార్లెట్ ఎడ్వర్డ్స్ 191 వన్డేలతో మూడో స్థానంలో ఉంది.
ఇదీ చదవండి: గోండు బిడ్డ..ఆటలో దిట్ట.. పేదరికాన్ని ఎదిరించి..!