ETV Bharat / sports

kohli vs Australia : ఆసీస్​పై సాధించిన కోహ్లీ రికార్డులివే.. మరి ఈసారి ఏం చేస్తాడో?

kohli vs Australia in test : డబ్ల్యూటీసీ ఫైనల్‌ బుధవారం నుంచే ప్రారంభం కానుంది. ఆసీస్​తో భారత్ తలపడనుంది. ఈ పోరులో భారత బ్యాటర్​ కోహ్లీ కీలకం కానున్నాడు. ఇప్పటివరకు అతడు ఆసీస్​పై సాధించిన రికార్డులు ఏంటి? ఈ మెగాటోర్నీ ఫైనల్ ద్వారా అతడి ఖాతాలోకి వెళ్లనున్న రికార్డులేంటి తెలుసుకుందాం..

WTC Final 2023 ind vs Aus  Virat kohli records on Australia
kohli vs Australia : ఆసీస్​పై సాధించిన కోహ్లీ రికార్డులివే.. మరి ఈసారి ఏం చేస్తాడో?
author img

By

Published : Jun 6, 2023, 10:24 PM IST

kohli vs Australia in test : డబ్ల్యూటీసీ ఫైనల్‌(#WTC Final) కోసం ప్రపంచ క్రీడాభిమానులంతా ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న ఈ పోరులో దిగ్గజ జట్లైన టీమ్​ఇండియా-ఆస్ట్రేలియా (India vs Australia) తలపడనున్నాయి. అయితే ఈ టోర్నీలో విరాట్‌ కోహ్లీ కీలకంగా మారే అవకాశం ఉంది. పరుగుల వరద పారించే ఈ రన్​ మెషిన్​ విజృంభిస్తే.. ప్రత్యర్థి జట్టుకు కష్టమనే చెప్పాలి. అతడి ఆసీస్‌పై మంచి రికార్డులే ఉన్నాయి.

ఇప్పటి వరకూ ఆసీస్‌పై 24 టెస్టులు ఆడిన విరాట్​.. 48.26 యావరేజ్​తో మొత్తం 1979 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, ఐదు హాఫ్​సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా నాలుగో టెస్టులో కోహ్లీ.. ఆసీస్‌పై 186 రన్స్​ నమోదు చేశాడు. ఇదే ఫామ్‌ను ఇప్పుడు WTC Finalలో కొనసాగిస్తే జట్టుకు కలిసొస్తుంది.

మొత్తంగా ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి.. కోహ్లీ 92 మ్యాచ్‌లు ఆడగా.. 50.97 యావరేజ్​తో 4,954 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 24 అర్ధ శతకాలు ఉన్నాయి.

ఓవల్‌లో మాత్రం.. ఫైనల్‌ జరిగే ఓవల్‌ లో మాత్రం కోహ్లీకి అంత గొప్ప రికార్డులు ఏమీ లేదు. ఈ వేదికగా మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 28.16 సగటుతో 169 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఆరు ఇన్నింగ్స్‌ల్లో .. రెండు సార్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఒకసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే.. రీసెంట్​గా తిరిగి ఫామ్‌ను అందుకున్న విరాట్​ .. WTC Final 2023లో చెలరేగి ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు.

WTC Final ద్వారా విరాట్‌ ముందు కొన్ని రికార్డులు ఉన్నాయి. అవేంటంటే..

  • ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 1,979 పరుగులు చేసిన కోహ్లీ.. మరో 21 పరుగులు చేస్తే రెండు వేల పరుగుల మార్క్​ను అందుకుంటాడు. మరో 55 పరుగులు చేస్తే.. ఆసీస్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 5 వేల పరుగులు పూర్తి చేస్తాడు.
  • ఐసీసీ టోర్నమెంట్స్‌ నాకౌట్‌ స్టేజ్‌ మ్యాచ్‌(అన్ని ఫార్మాట్లలో)ల్లో విరాట్‌ 620 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో అతడికన్నా ముందు సచిన్‌ (657), రికీ పాంటింగ్‌ (731) మాత్రమే ఉన్నారు. ఈ ఫైనల్‌ ద్వారా అతడు ఈ జాబితాలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
  • టెస్టుల్లో ఒకే బౌలర్‌పై అత్యధిక పరుగులు చేసిన రికార్డు పుజారా పేరిట ఉంది. నాథన్‌ లయన్‌ బౌలింగ్‌లో అతడు 570 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. నాథన్‌ బౌలింగ్‌లోనే విరాట్​ 511 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు.
  • ఇంగ్లాండ్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్స్​లో రాహుల్‌ ద్రవిడ్‌ ముందున్నాడు. 46 మ్యాచ్‌ల్లో అతడు 2,645 పరుగులు సాధించాడు. ఆ తర్వాత సచిన్‌(2,626 పరుగులు) ఉండగా.. మూడో స్థానంలో విరాట్‌(2,574) ఉన్నాడు. మరో 72 పరుగులు చేస్తే.. కోహ్లీ అగ్రస్థానంలోకి వస్తాడు.
  • ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత ప్లేయర్స్​లో సచిన్‌(11 సెంచరీలు) ముందున్నాడు. ఆ తర్వాత గావస్కర్‌-విరాట్‌(8 సెంచరీలు) ఉన్నారు. మరో సెంచరీ చేస్తే.. కోహ్లీ ఈ జాబితాలో సెకండ్​ ప్లేస్​లోకి వస్తాడు.
  • ఐసీసీ నిర్వహించే టోర్నీ ఫైనల్స్‌లో సెంచరీ చేసిన ఏకైక భారత బ్యాటర్‌ గంగూలీనే. 2000లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో అతడు సెంచరీ బాదాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ టీమ్‌ఇండియా ప్లేయర్​ ఐసీసీ ట్రోఫీ ఫైనళ్లలో సెంచరీ చేయలేదు. ఇప్పుడు విరాట్‌ కొడతాడేమో చూడాలి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.