ETV Bharat / sports

World Cup 2023 Prize Money : వామ్మో.. వరల్డ్ కప్​ విజేత 'ప్రైజ్​మనీ' ఎంతో తెలిస్తే షాకే! - under 19 world cup 2024 ind matches

World Cup 2023 Prize Money : 2023 ప్రపంచకప్ విన్నర్, రన్నరప్​కు అందించే ప్రైజ్​మనీ వివరాలను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. ఎంతంటే

World Cup 2023 Prize Money
World Cup 2023 Prize Money
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 5:14 PM IST

Updated : Sep 22, 2023, 5:55 PM IST

World Cup 2023 Prize Money : 2023 ప్రపంచకప్ అక్టోబర్ 5న ప్రారంభమై.. నవంబర్ 17న ముగియనుంది. ఈ ప్రతిష్ఠాత్మకమైన టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగాటోర్నీ విజేతతో పాటు రన్నరప్​, ఇంకా ఆయా ప్రైజ్​మనీ అవార్డును ఐసీసీ శుక్రవారం ప్రకటించింది.

  • విజేత - 40 లక్షల డాలర్లు (సుమారు రూ. 32 కోట్లు)
  • రన్నరప్ - 20 లక్షల డాలర్లు (సుమారు రూ. 16 కోట్లు)
  • సెమీఫైనల్స్​లో ఓడిన జట్టు - 8 లక్షల డాలర్లు (సుమారు రూ. 6.5 కోట్లు)
  • గ్రూప్ స్టేజ్​ తర్వాత నిష్క్రమించిన జట్టు - లక్ష డాలర్లు (సుమారు రూ. 82 లక్షలు)
  • గ్రూప్ స్టేజ్​లో నెగ్గిన ప్రతీ మ్యాచ్​కు - 40000 డాలర్లు (సుమారు రూ. 32 లక్షలు).

13వ ఎడిషన్ ప్రపంచకప్​ టోర్నమెంట్​లో ఆయా విజేతలకు ఐసీసీ.. మొత్తం 10 మిలియన్ల డాలర్ల ( సుమారు రూ. 82 కోట్ల) ప్రైజ్​మనీని ఐసీసీ అందించనుంది. అయితే 2025లో జరగనున్న మహిళల ప్రపంచకప్​లో కూడా.. ఇదే విధంగా ప్రైజ్​మనీని అందించనున్నట్లు ఐసీసీ తెలిపింది.​ ఇక ఈ వరల్డ్ కప్​లో మొత్తం 10 వేదికల్లో 48 మ్యాచ్​లు జరగనున్నాయి. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు.. అన్ని జట్లు రెండు వార్మప్ మ్యాచ్​లు ఆడనున్నాయి.

  • The total prize pool for #CWC23, including the cash prize for the winners, has been announced 💰

    Details 👇

    — ICC (@ICC) September 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Under 19 World Cup 2024 : అండర్‌ 19 పురుషుల క్రికెట్‌ ప్రపంచ కప్‌ - 2024 షెడ్యూల్‌ను ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ ప్రపంచకప్​నకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఈ జట్లను నాలుగు గ్రూపులు విభజించారు. ఒక్కో గ్రూపులో నాలుగేసి టీమ్స్​ ఉంటాయి. ఈ క్రమంలో యువ భారత్‌ గ్రూప్‌ ఏ లో ఆడనుంది. ఇక లీగ్‌ దశలో బంగ్లాదేశ్‌ (జనవరి 14న), యూఎస్‌ఏ (18న), ఐర్లాండ్‌ (20న)తో టీమ్‌ఇండియా మ్యాచ్‌లు ఆడుతుంది. వార్మప్ మ్యాచ్​లు జనవరి 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఇక ఫిబ్రవరి 4న కొలంబో సిన్హాల్స్ స్పోర్ట్స్​ క్లబ్​ మైదానంలో ఫైనల్ జరగనుంది.

Pakistan Squad For World Cup 2023 : వరల్డ్​కప్​నకు పాక్ జట్టు రెడీ.. సగం మంది ఎవరికీ తెలీదు భయ్యా!

How to Follow Indian Cricket Team in WhatsApp: క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. ఇకపై వాట్సాప్​లో టీమిండియా.. ఇలా ఫాలో అవ్వండి

Last Updated : Sep 22, 2023, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.