ETV Bharat / sports

'కోహ్లీ ఒక సూపర్​హ్యూమన్​.. ఆ జాబితాలో అతడే నెం.1' - జో రూట్

Virat Kohli: కొన్నేళ్లుగా మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. అయినప్పటికీ టెస్టు క్రికెట్​లో టాప్​ 5 అత్యుత్తమ ఆటగాళ్లలో అతడే నెం.1 అని కొనియాడాడు ఆస్ట్రేలియా మాజీ ఆల్​రౌండర్ షేన్ వాట్సన్. కోహ్లీ ఒక సూపర్​హ్యూమన్​లా ఆడతాడని ప్రశంసించాడు.

Virat Kohli
shane watson virat kohli
author img

By

Published : Apr 14, 2022, 10:57 PM IST

Virat Kohli: టెస్టు క్రికెట్​లోని 'బిగ్​ 5'లో టీమ్​ఇండియా స్టార్​ విరాట్​ కోహ్లీనే అత్యుత్తమని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ ఆల్​రౌండర్ షేన్ వాట్సన్. అయితే 2019 నవంబర్​ నుంచి అతడు సెంచరీ చేయకపోవడానికి గల కారణాలపై పెద్దగా చర్చ అవసరంలేదని భావించాడు. వాట్సన్ జాబితా ప్రకారం.. స్టీవ్​ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్, బాబర్ అజామ్ కన్నా కోహ్లీనే ముందున్నాడు. ఈ మేరకు ఐసీసీ రివ్యూ లేటెస్ట్ ఎపిసోడ్​లో టెస్టుల్లో అత్యుత్తమం ఎవరనేదానిపై వాట్సన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

Virat Kohli
విరాట్ కోహ్లీ

"టెస్టుల్లో అత్యుత్తమం ఎవరంటే ఎప్పుడైనా నేను విరాట్ కోహ్లీ అనే చెబుతాను. అతడు చేసేది దాదాపు సూపర్​హ్యూమన్​లా ఉంటుంది. ఆడటానికి వెళ్లిన ప్రతిసారీ చాలా తీవ్రత కలిగి ఉంటాడు"

-షేన్ వాట్సన్, ఆస్ట్రేలియా మాజీ ఆల్​రౌండర్

Virat Kohli
కోహ్లీ

ఐసీసీ ర్యాంకుల్లో కోహ్లీ పదో స్థానానికి పడిపోయినప్పటికీ టెస్టుల్లో అద్వితీయ రికార్డు కలిగి ఉన్నాడు. ప్రస్తుతానికి దాదాపు 50శాతం బ్యాటింగ్​ సగటుతో 27 శతకాలతో పాటు 28 అర్ధశతకాలు అతడి ఖాతాలో ఉన్నాయి. కోహ్లీ తర్వాత.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ 2​, స్టీవ్ స్మిత్ 3, కేన్ విలియమ్సన్ 4, జో రూట్​ 5వ స్థానాల్లో ఉంటారని వాట్సన్ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: Virat Kohli: అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.