ETV Bharat / sports

జిమ్​లో విరాట్​ కసరత్తులు.. అసలు ఈ 'లెగ్​ డే' అంటే ఏంటి ? - విరాట్​ కోహ్లీ లెగ్ ఎక్సర్​సైజ్ ఫొటోస్

ఆట ఎలాంటిదైన సరే విరాట్ కోహ్లీ మైదానంలో దిగాడంటే ఇక మెరుపు వేగంతో చెలరేగిపోతుంటాడు. తన స్టైల్​తో బాల్​ను బౌండరీ దాటిస్తూ స్కోర్​ బోర్డును పరుగులు పెట్టింస్తుంటాడు. అయితే ఈ రన్నింగ్ మెషిన్​ ఇలా చురుగ్గా ఉండటానికి అతడి ఫిట్‌నెస్‌ స్థాయే కారణం. జిమ్​లో విపరీతంగా కష్టపడుతూ ఎందరికో ఇన్​స్పిరేషన్​గా నిలుస్తుంటాడు. అదే తన విజయ రహస్యమని చాలాసార్లు చెప్పాడు. ఇటీవలే విండీస్​ పర్యటనకు వెళ్లిన ఈ స్టార్​ క్రికెటర్​ అక్కడ కూడా కసరత్తులు చేస్తూ కనిపించాడు. అయితే దీనికి ఆయన లెగ్​డే అని పేరు పెట్టాడు. ఇంతకీ ఈ 'లెగ్​ డే' ఏంటంటే ?

Virat Kohli  Exercises
Virat Kohli Leg Exercises
author img

By

Published : Jul 9, 2023, 2:23 PM IST

Updated : Jul 9, 2023, 2:35 PM IST

Virat Kohli Leg Exercises : సినిమా స్టార్సే కాదు క్రికెటర్స్​ కూడా తమ ఫిటెనెస్​ విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తుంటారు. స్వతహాగా అథ్లెట్స్​ అయిన వారు బేసిక్ వర్కౌట్స్​తోనే తమను తాము ఫిట్​గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. దీని ద్వారా ఆటతీరులో మార్పుతో పాటు ఆరోగ్యంగా ఉండొచ్చని వారి నమ్మకం. ఇక ఫిట్‌నెస్ విషయంలో స్టార్​ క్రికెటర్​ విరాట్ కోహ్లీ ఎంత నిక్కచ్చిగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఎనిమిదేళ్ల నుంచి ఒక్కసారి కూడా జాతీయ క్రికెట్ అకాడమీకి అతను వెళ్లలేదంటే తన ఫిట్‌నెస్‌ స్థాయి ఏ రేంజ్​లో ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

తాజాగా విండీస్‌ పర్యటనకు వెళ్లిన విరాట్.. తన ఫిట్‌నెస్‌ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించట్లేదు. అక్కడ కూడా తన బిజీ షెడ్యూల్​ను బ్యాలెన్స్​ చేస్తునే.. జిమ్​లో కసరత్తలు చేస్తూ కనిపించాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. "ప్రతి రోజు 'లెగ్‌డే'. గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతోంది" అంటూ ఓ క్యాప్షన్​ను రాసుకొచ్చాడు. తన జిమ్​ కోచ్‌తో కలిసి కాళ్లను బలోపేతం చేసే పలు వ్యాయామాలను చేశాడు. దీంతో నెటిజన్లు అసలు 'లెగ్‌ డే' అంటే ఏంటి అని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. అసలు ఈ లెగ్‌ వర్కౌట్లు ఏంటంటే?

Leg Exercise Uses : స్పోర్ట్స్​ ఆడే వారిలో కాళ్లు చాలా బలంగా ఉండాలి. క్రికెట్‌లో ఆటగాళ్లు ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌ చేసే సమయంలో వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడం, బౌలింగ్‌ కోసం రనప్‌ చేయడం లాంటివి చేస్తుంటారు. అటువంటి సమయంలో తమ కాళ్లు చురుగ్గా స్పందించాలంటే మరి తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే. వీటన్నింటినీ కోచ్‌ పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. అయితే బరువులను మోయడం వంటి వ్యాయామాలు చేయడం వల్ల పిక్కలు బలంగా మారతాయి. ఇవి గాయాల ప్రభావాన్ని తగ్గించేందుకు సహాయ పడుతుందని. బాడీ సైన్స్‌ అకాడమీ సహవ్యవస్థాపకుడు వరుణ్ రత్తన్‌ 'లెగ్‌ ఎక్స్‌ర్‌సైజ్‌'ల గురించి వివరించారు.

బరువు పెంచుకుంటూ..
లెగ్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లను విభిన్న రకాలుగా చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్​ సమయంలో క్రమంగా బరువు, రెప్స్‌, సెట్స్‌ను పెంచుకుంటూ పోవాలి. ఇలా చేయడం వల్ల కండరాలకు ఏదైనా సవాళ్లు ఎదురైతే.. అవి మరింత బలపడతాయి. మీరు ఒక నిర్దిష్టమైన బరువును మూడు సెట్లలో 12 రెప్స్‌ చేస్తూ ఉన్నారని అనుకుంటే. అది కాస్త ఈజీగానే ఉంటుంది. కానీ అదే ప్రతి సెట్‌కు బరువును ఓ పదిశాతం పెంచుకుంటూ పోతే ఇక కండరాలకు సవాలుగా అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల కండరాలు బలోపేతంగా మారతాయి.

రెసిస్టెన్స్‌ ఎక్స్‌ర్‌సైజ్‌
ఫిట్‌నెస్‌, శారీరకంగా బలంగా మారడానికి రెసిస్టెన్స్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లు మరింత ప్రభావం చూపుతాయి. అదే సమయంలో ఈ ఎక్సర్సైజ్​ సురక్షితమైనది. ఇది కండరాల్లో వృద్ధిని ప్రేరేపిస్తాయి. ఎముకలను మరింత బలంగా మారుస్తాయి. ఈ వ్యాయామాలు చేయడం వల్ల ఓర్పు, సహనం, శక్తిని లభించి.. జీవన శైలిపై సానుకూల ప్రభావం చూపిస్తాయన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు.

సమగ్ర బాడీ ఎక్స్‌ర్‌సైజ్‌..
మరోవైపు వ్యాయామ ప్రణాళికలో కార్డియోతో పాటు, కండరాల బలోపేతానికి చేసే వ్యాయామాలు కూడా ఉంటాయి. దీని వల్ల శరీరానికి మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయి. అయితే, ఒకేసారి అన్ని వ్యాయామాలు చేయాల్సిన పని లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాగింగ్, స్విమ్మింగ్‌ లాంటివి కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. వారంలో ఇలా ఐదు రోజులు చేయడం వల్ల మనకు సత్ఫలితాలు లభిస్తాయి. కండరాలను మరింత శక్తిమంతంగా మార్చుకోవడానికి ఇలా వారానికి రెండుసార్లు ఓ పది రకాల ఎక్స్‌ర్‌సైజ్‌లను 8 నుంచి 12సార్లు చేయాల్సి ఉంటుంది. వీటిల్లో రెసిస్టెన్స్‌ బ్యాండ్స్‌, బరువులను ఎత్తడం, శరీర బరువునే వినియోగించుకుని వ్యాయామం చేయడం లాంటివి కూడా ఉంటాయి.

Last Updated : Jul 9, 2023, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.