ETV Bharat / sports

T20 world cup 2021: కెప్టెన్స్​ కోహ్లీ-బాబర్​ రికార్డ్స్​ ఇవే​ - ​ బాబర్​ అజమ్

టీ20 ప్రపంచకప్​లో(T20 worldcup schedule) భాగంగా మరి కొద్దిగంటల్లో భారత్​-పాకిస్థాన్ మధ్య రసవత్తర పోరు జరగనుంది. చాలా కాలం తర్వాత ఇరు జట్ల మధ్య మ్యాచ్​ జరగనుండటం వల్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా కెప్టెన్స్ కోహ్లీ, బాబర్​ అజమ్​ రికార్డులను ఓసారి పరిశీలిద్దాం..

t20 world cup
భారత్-పాక్ మ్యాచ్
author img

By

Published : Oct 24, 2021, 5:31 PM IST

ఒకరేమో ఆల్​టైమ్, ఆల్​ ఫార్మాట్​ గ్రేట్​ బ్యాట్స్​మన్​. టీ20ల్లో పదివేలకు పైగా పరుగులు సాధించిన ఐదుగురు ఆటగాళ్ల జాబితాలో ఒకడిగా నిలిచాడు. మరొకరేమో.. దాదాపు ఇదే పేరును అందుకునే క్రమంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆరు వేలకు పైగా రన్స్​ చేశాడు. వీరిద్దరూ టాప్​ ఆర్డర్​ బ్యాటర్స్​​, ప్రపంచ మేటి బ్యాట్స్​మెన్​లో ఒకరు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మీరు చదువుతున్నది ఎవరి గురించో. వారే టీమ్​ఇండియా సారథి కోహ్లీ, పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజమ్​. మరికొద్ది గంటల్లో భారత్​-పాక్​ మధ్య మ్యాచ్​ ఆరభం కానుంది. ఈ రసవత్తర పోరు కోసం కోట్ల మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీ20ల్లో ఇరు జట్ల సారథుల రికార్డులపై ఓ లుక్కేద్దాం..

కోహ్లీ రికార్డ్స్​(kohli t20 captaincy stats)

T20 world cup 2021
కెప్టెన్స్ కోహ్లీ

భారత్​ నుంచి ఒక్కడే..

టీ20ల్లో పదివేలకుపైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు కోహ్లీ. ఈ జాబితాలో క్రిస్​గేల్​(14,276), కీరన్​ పొలార్డ్(11,236)​, షోయబ్​ మాలిక్(11,033)​, కోహ్లీ(10,136), వార్నర్(10,019). భారత్​ తరఫున ఈ ఫీట్​ను అందుకున్న తొలి ఆటగాడు ఇతడే కావడం విశేషం. ఇప్పటికీ ఈ లిస్ట్​లో విరాట్ మాత్రమే టీమ్​ఇండియా నుంచి ఉన్నాడు.

అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు(kohli t20 runs overall)

గత పదేళ్లలో 90 మ్యాచ్​లు ఆడిన విరాట్​.. 139.04స్ట్రైక్​రేట్​తో 3,159 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్​లో మూడు వేల పరుగులు సాధించిన తొలి ప్లేయర్​గా నిలిచాడు. ఆ తర్వాత మార్టిన్​ గప్టిల్​(2,939), రోహిత్​శర్మ(2,864) ఉన్నారు. టీ20ల్లో 50కిపైగా సగటు ఉన్నది ఇతడొక్కడికే.

50ప్లస్​ స్కోరు(virat kohli half centuries in t20)

టీ20ల్లో అత్యధిక(28) హాఫ్​ సెంచరీలు చేశాడు. అయితే శతకాలు మాత్రం బాదలేదు. రోహిత్​శర్మ ఇప్పటివరకు 22 హాఫ్​ సెంచరీలు, నాలుగు శతకాలు బాదాడు.

టీ20 ప్రపంచకప్​లో అత్యధిక పరుగులు(virat kohli t20 world cup runs)

టీ20 ప్రపంచకప్​లో భారత్​ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు కోహ్లీ. 16మ్యాచ్​ల్లో 86.33 సగటుతో 777 రన్స్​ చేశాడు. ఇందులో 9 హాఫ్​సెంచరీలు ఉన్నాయి. విదేశీ ఆటగాళ్లలో మహేలా జయవర్దనె(1,016), క్రిస్​గేల్​(920), దిల్షన్​(897) రన్స్​తో కొనసాగుతున్నారు.

ఓకే సీజన్​లో ఎక్కువ రన్స్​..

2014లో ఆరు మ్యాచ్​ల్లో 106.33 సగటుతో 319 పరుగులు చేసి.. ఒకే సీజన్​లో అత్యధిక రన్స్​ చేసిన ప్లేయర్​గా నిలిచాడు విరాట్​. ఈ ప్రపంచకప్​ ఫైనల్​లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్​గా నిలిచింది టీమ్​ఇండియా.

బాబర్​ అజమ్​(babar azam t20 captaincy record)

t20 world cup
బాబర్ అజమ్

బాబర్​ అజమ్​ కూడా ప్రపంచంలోని మేటి బ్యాట్స్​మెన్​లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఫామ్​లో ఉన్న ఇతడు త్వరలోనే కోహ్లీ రికార్డులను చేరుకుంటాడని క్రీడావిశ్లేషకులు భావిస్తున్నారు. టీ20లో పదివేలకు పైగా పరుగులు సాధించడానికి ఎక్కువ సమయం కూడా పట్టకపోవచ్చని అంటున్నారు.

అత్యధిక పరుగులు(babar azam highest t20 score)

టీ20 ఫార్మాట్​లో 61 మ్యాచ్​ల్లో 2204 పరుగులు చేసి పదో స్థానంలో కొనసాగుతున్నాడు. కెప్టెన్​గా(babar azam highest t20 score) ఒకే ఇన్నింగ్స్​లో సెంచరీ(122) చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. కెరీర్​ అత్యధిక బ్యాటింగ్​ యావరేజ్​(46.89). ఇప్పటివరకు 21 హాఫ్​ సెంచరీలు బాదాడు. అందులో మూడు వరుస అర్థ శతకాలు ఉండటం విశేషం.

ఈ ఫార్మాట్​లో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా బాబర్(26 ఇన్నింగ్స్​లో) నిలిచాడు. రెండు వేల పరుగులను 52 ఇన్నింగ్స్​ల్లో పూర్తి చేసిన తొలి ప్లేయర్​గా కొనసాగుతున్నాడు.

గత రెండేళ్లుగా..

రికార్డుల రారాజుగా పేరున్న కోహ్లీ(kohli performance) గత రెండేళ్లుగా ఫామ్​లో లేడు. పరుగులు చేయడానికి బాగా ఇబ్బందిపడుతున్నాడు. గత 44 ఇన్నింగ్స్​లో పదిసార్లు మాత్రమే హాఫ్​ సెంచరీ చేశాడు. ఇది అతడి స్థాయికి చాలా తక్కువనే చెప్పాలి. అయితే బాబర్(babar azam performance)​ మాత్రం మంచి ఫామ్​లో ఉన్నాడు. ప్రతి 2.1 ఇన్నింగ్స్​కు అర్ధ శతకం బాదుతున్నాడు.

అతడు ప్రపంచకప్​లో తొలిసారి పాల్గొననున్నాడు. మరి ఈ ప్రపంచకప్​లో ఈ ఇరు జట్ల సారథులు ఎలా ప్రదర్శన చేస్తారో, తమ జట్టుకు విజయాన్ని అందిస్తారో లేదో చూడాలి. మరోవైపు సారథిగా విరాట్​కు ఇదే చివరి ప్రపంచకప్​.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.