ఒకడేమో ఆల్‌టైమ్, ఆల్ ఫార్మాట్ గ్రేట్ బ్యాట్స్‌మన్. టీ20ల్లో పదివేలకు పైగా పరుగులు సాధించిన ఐదుగురు ఆటగాళ్ల జాబితాలో ఒకడిగా నిలిచాడు. ఇంకొకడు దాదాపు ఇదే పేరును అందుకునే క్రమంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆరు వేలకు పైగా రన్స్ చేశాడు. వీరిద్దరూ టాప్ ఆర్డర్ బ్యాటర్స్, ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకరు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మీరు చదువుతున్నది ఎవరి గురించో. వారే టీమ్ఇండియా సారథి కోహ్లీ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 24 భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ పోరు కోసం ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీ20ల్లో ఇరు జట్ల సారథుల రికార్డులపై ఓ లుక్కేద్దాం..
కోహ్లీ రికార్డ్స్(kohli t20 captaincy stats)
భారత్ నుంచి ఒక్కడే
టీ20ల్లో పదివేలకుపైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు కోహ్లీ. ఈ జాబితాలో క్రిస్‌గేల్(14,276), కీరన్ పొలార్డ్(11,236), షోయబ్ మాలిక్(11,033), కోహ్లీ(10,136), వార్నర్(10,019). భారత్ తరఫున ఈ ఫీట్‌ను అందుకున్న తొలి ఆటగాడు ఇతడే కావడం విశేషం. ఇప్పటికీ ఈ లిస్ట్‌లో విరాట్ మాత్రమే టీమ్ఇండియా నుంచి ఉన్నాడు.
అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు(kohli t20 runs overall)
గత పదేళ్లలో 90 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 139.04స్ట్రైక్‌రేట్‌తో 3,159 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో మూడు వేల పరుగులు సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఆ తర్వాత మార్టిన్ గప్టిల్(2,939), రోహిత్‌శర్మ(2,864) ఉన్నారు. టీ20ల్లో 50కిపైగా సగటు ఉన్నది ఇతడొక్కడికే.
50ప్లస్ స్కోరు(virat kohli half centuries in t20)
టీ20ల్లో అత్యధిక(28) హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే శతకాలు మాత్రం బాదలేదు. రోహిత్‌శర్మ ఇప్పటివరకు 22 హాఫ్ సెంచరీలు, నాలుగు శతకాలు బాదాడు.
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు(virat kohli t20 world cup runs)
టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు కోహ్లీ. 16మ్యాచ్‌ల్లో 86.33 సగటుతో 777 రన్స్ చేశాడు. ఇందులో 9 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. విదేశీ ఆటగాళ్లలో మహేలా జయవర్దనె(1,016), క్రిస్‌గేల్(920), దిల్షన్(897) రన్స్‌తో కొనసాగుతున్నారు.
ఓకే సీజన్లో ఎక్కువ రన్స్
2014లో ఆరు మ్యాచ్‌ల్లో 106.33 సగటుతో 319 పరుగులు చేసి.. ఒకే సీజన్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు విరాట్. ఈ ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది టీమ్ఇండియా.
బాబర్ అజమ్(babar azam t20 captaincy record)
బాబర్ అజమ్ కూడా ప్రపంచంలోని మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న ఇతడు త్వరలోనే కోహ్లీ రికార్డులను చేరుకుంటాడని క్రీడావిశ్లేషకులు భావిస్తున్నారు. టీ20లో పదివేలకు పైగా పరుగులు సాధించడానికి ఎక్కువ సమయం కూడా పట్టకపోవచ్చని అంటున్నారు.
అత్యధిక పరుగులు(babar azam highest t20 score)
టీ20 ఫార్మాట్లో 61 మ్యాచ్‌ల్లో 2204 పరుగులు చేసి పదో స్థానంలో కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా(babar azam highest t20 score) ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీ(122) చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. కెరీర్ అత్యధిక బ్యాటింగ్ యావరేజ్(46.89). ఇప్పటివరకు 21 హాఫ్ సెంచరీలు బాదాడు. అందులో మూడు వరుస అర్థ శతకాలు ఉండటం విశేషం.
ఈ ఫార్మాట్లో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా బాబర్(26 ఇన్నింగ్స్‌లో) నిలిచాడు. రెండు వేల పరుగులను 52 ఇన్నింగ్స్‌ల్లో పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.
గత రెండేళ్లుగా
రికార్డుల రారాజుగా పేరున్న కోహ్లీ(kohli performance) గత రెండేళ్లుగా ఫామ్‌లో లేడు. పరుగులు చేయడానికి బాగా ఇబ్బందిపడుతున్నాడు. గత 44 ఇన్నింగ్స్‌లో పదిసార్లు మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. ఇది అతడి స్థాయికి చాలా తక్కువనే చెప్పాలి. అయితే బాబర్(babar azam performance) మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రతి 2.1 ఇన్నింగ్స్‌కు అర్ధ శతకం బాదుతున్నాడు.
అతడు ప్రపంచకప్‌లో తొలిసారి పాల్గొననున్నాడు. మరి ఈ ప్రపంచకప్‌లో ఈ ఇరు జట్ల సారథులు ఎలా ప్రదర్శన చేస్తారో, తమ జట్టుకు విజయాన్ని అందిస్తారో లేదో చూడాలి. మరోవైపు సారథిగా విరాట్‌కు ఇదే చివరి ప్రపంచకప్.
ఇదీ చూడండి: Virat Kohli news: కోహ్లీ-శాస్త్రి కాంబో సక్సెస్ అయిందా?