ETV Bharat / sports

విరాట్​ కోహ్లీ ఖాతాలో మరో 'సెంచరీ'.. సచిన్​, ధోనీ సరసన..!

Virat Kohli Elite List: విరాట్​ కోహ్లీ ఖాతాలో రికార్డులు వచ్చి చేరడం సాధారణమే. బాగా ఆడినా, ఆడకపోయినా.. ఘనతలు సాధిస్తూనే ఉంటాడు. ఫార్మాట్లకు అతీతంగా.. విరాట్​ సెంచరీ చేసి దాదాపు రెండేళ్లు అయింది. అయితే.. విండీస్​తో బుధవారం జరగనున్న రెండో వన్డే మ్యాచ్​తో.. కోహ్లీ సెంచరీ మైలురాయిని చేరుకోనున్నాడు. ఎలా అనుకుంటున్నారా? ఇది చదవండి..

Virat Kohli set to join icons Sachin Tendulkar

author img

By

Published : Feb 9, 2022, 5:35 AM IST

Virat Kohli Elite List: వెస్టిండీస్​తో జరగనున్న రెండో వన్డేతో భారత మాజీ సారథి విరాట్​ కోహ్లీ మరో ఘనత సాధించనున్నాడు. గత రెండేళ్లుగా అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేయలేకపోతున్న విరాట్​.. ఈ మ్యాచ్​ ఆడితే సెంచరీ మైలురాయిని అందుకుంటాడు. అదెలా అంటారా?

విండీస్​తో బుధవారం జరిగే రెండో వన్డే.. కోహ్లీకి స్వదేశంలో 100వ వన్డే. ఇప్పటివరకు 258 వన్డే మ్యాచ్​లు ఆడిన ఈ భారత మాజీ సారథి స్వదేశంలో 99 వన్డేలు ఆడాడు. విండీస్​తో రెండో వన్డే ఆడితే.. ఈ ఫార్మాట్లో స్వదేశంలో 100కుపైగా వన్డేలు ఆడిన 36వ క్రికెటర్​గా ఘనత సాధించనున్నాడు.

భారత్​ నుంచి ఇప్పటికే మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందుల్కర్​(164), మహేంద్ర సింగ్​ ధోనీ(127), అజహరుద్దీన్​(113), యువరాజ్​ సింగ్ (108) స్వదేశంలో 100కుపైగా వన్డేలాడారు. ​

1000వ వన్డేలో రికార్డు..

విండీస్​తో జరిగిన తొలి వన్డే.. భారత్​కు 1000వ వన్డే మ్యాచ్​ కావడం విశేషం. ఏ జట్టూ ఇన్ని మ్యాచ్​లు ఆడలేదు. ఈ మ్యాచ్​లోనే అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై 5 వేలకుపైగా పరుగులు చేసిన బ్యాట్స్​మెన్​ జాబితాలో చేరాడు విరాట్​. ఈ రికార్డు నెలకొల్పిన నాలుగో బ్యాట్స్​మెన్​గా నిలిచాడు.

అగ్రస్థానంలో సచిన్​ తెందుల్కర్​ ఉన్నాడు. సచిన్.. 48.11 సగటుతో 6976 పరగులు చేశాడు. ఆ తర్వాత స్థానాల్లో రికీ పాంటింగ్​ (ఆస్ట్రేలియా) 5521 పరుగులు- 39.71 సగటు, కల్లీస్​ (దక్షిణాఫ్రికా) 5186 పరుగులు- 45.89 సగటుతో నిలిచారు. సగటు(60.17)లో విరాట్​ కోహ్లీనే అగ్రస్థానంలో ఉన్నాడు. సొంతగడ్డపై అత్యంత వేగంగా 5వేల పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

సొంతగడ్డపై విరాట్​ కోహ్లీ 99 మ్యాచ్​ల్లో 5002 పరుగులు చేశాడు. ఇందులో 19 శతకాలు, 25 అర్థశతకాలు ఉన్నాయి.

ఇవీ చూడండి: టీమ్​ ఇండియా టెస్టు కెప్టెన్​గా అతడి పేరే ఖరారు!

గెలిచి నిలవాలని 'విండీస్'​.. సిరీస్​పై కన్నేసిన 'భారత్'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.