ETV Bharat / sports

Virat Kohli Favourite Cricketer : విరాట్ కోహ్లీ ఫేవరెట్ క్రికెటర్​ సచిన్​ కాదట! ఎవరో తెలిస్తే షాక్​ అవుతారు.. - విరాట్​ కోహ్లి ఫేవరట్​ క్రికెటర్

Virat Kohli Favourite Cricketer : ఇప్పటి కాలంలో ఉన్న క్రికెటర్లలో టీమ్​ రన్నింగ్ మెషిన్​ విరాట్​ కోహ్లికి ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఎక్కువే. తన లుక్స్​తో పాటు అతని ఆటతీరు చూసి ఎంతో మంది విరాట్​ను ఇష్టమైన​ వ్యక్తుల లిస్ట్​లో చేర్చుకున్నారు. ఇలా ఎంతో మందికి ఫేవరట్​ అయిన విరాట్​ ఇప్పటి వరకు తన ఫేవరట్​ స్టార్​గా సచిన్​ పేరు చెప్పేవాడు. అయితే తాజాగా మాత్రం ఈ ప్రశ్నకు ఓ స్టార్​ ప్లేయర్​ పేరు చెప్పి అందరీని షాక్​కు గురిచేశాడు. ఇంతకీ అతను ఎవరంటే?

Virat Kohli Favourite Cricketer
Virat Kohli Favourite Cricketer
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 11:01 AM IST

Virat Kohli Favourite Cricketer : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్​ విరాట్​ కోహ్లీ.. మైదానంలోకి దిగితే ఇక ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బాల్​ను బౌండరీ దాటిస్తుంటాడు. తన సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్న ఈ రన్నింగ్​ మెషిన్​.. తన ఆటతీరుతో ఈ తరం యువతకు ఇన్​స్పిరేషన్​గా నిలుస్తున్నాడు. అయితే ఎంతో మందికి ఫేవరట్​గా ఉన్న ఈ స్టార్ ప్లేయ‌ర్​కు క్రికెట్​ గాడ్​ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పటి నుంచి సచిన్​ ఆటను చూస్తూ పెరిగిన కోహ్లి.. కెరీర్‌ ఆరంభంలోనే తన ఫేవరట్​ స్టార్​తో కలిసి ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మైదానంలోనే కాకుండా బయట కూడా సచిన్‌ను దగ్గర నుంచి గమనించిన విరాట్‌.. ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానంటూ గతంలో చెప్పుకొచ్చాడు.

అయితే తాజాగా ఓ యాంకర్​.. ప్ర‌స్తుతం ఉన్న ప్లేయర్స్​లో మీ ఫేవ‌రెట్ క్రికెట‌ర్ ఎవ‌రు? అంటూ అడిగిన ప్ర‌శ్న‌కు కోహ్లి ఊహించ‌ని స‌మాధానం చెప్పాడు. దీంతో ఫ్యాన్స్​ ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే విరాట్​ తన ఫేవరట్​ స్టార్​గా ఇంగ్లాండ్‌ జట్టు ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్​ పేరు చెప్పాడు. జట్టు తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్టోక్స్​కు తాను అభిమానినని అంటూ కోహ్లి వెల్లడించాడు.

Virat Kohli Ind Vs Nepal : మరోవైపు సోమవారం జరిగిన ఆసియా కప్​ మ్యాచ్​లో విరాట్‌ కోహ్లీ మరో రికార్డును అందుకున్నాడు. నేపాల్​తో జరిగిన ఈ మ్యాచ్​లో ఆసిఫ్‌ షేక్‌ క్యాచ్‌ పట్టడం వల్ల విరాట్​ మల్టీ నేషనల్‌ వన్డే టోర్నమెంట్లలో 100 క్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. భారత మాజీ సారథి మొహ్మద్​ అజహారుద్దీన్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో నాన్‌ వికెట్‌కీపర్‌గా రికార్డుకెక్కాడు. నేపాల్‌ ఇన్నింగ్స్‌ 30వ ఓవర్‌లో మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో కోహ్లీ ఈ క్యాచ్‌ను పట్టుకున్నాడు. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి ఎగరగా విరాట్​ ఒంటి చేత్తో ఆ క్యాచ్‌ను అందుకున్నాడు.

Virat Kohli Yo Yo Test : కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్‌!.. యో-యో టెస్ట్​ స్కోర్​ వల్లే!

Virat Kohli International Debut : విరాట్​ @ 15 ఏళ్లు.. సుదీర్ఘ కెరీర్​లో రన్నింగ్​ మెషిన్​ రికార్డులు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.