ETV Bharat / sports

కోహ్లీ ఫ్యాన్స్​కు బ్యాడ్​న్యూస్.. ప్రేక్షకులు లేకుండానే​ 100వ టెస్టు - ఇండియా శ్రీలంక టెస్టు

Kohli 100 Test: మొహాలీ వేదికగా జరిగే విరాట్​ కోహ్లీ 100వ టెస్టుకు ప్రేక్షకులను అనుమతించట్లేదని పంజాబ్​ క్రికెట్​ అసోసియేషన్​ వెల్లడించింది. ఈ నిర్ణయంతో కోహ్లీ అభిమానులకు నిరాశే మిగిలింది.

virat kohli
విరాట్​ కోహ్లీ
author img

By

Published : Feb 26, 2022, 3:31 PM IST

Kohli 100 Test: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్, స్టార్​ బ్యాటర్​, రన్​మెషీన్​ విరాట్​ కోహ్లీ.. మొహాలీ వేదికగా తన 100వ అంతర్జాతీయ టెస్టు ఆడనున్నాడు. మార్చి 4న జరిగే ఈ మ్యాచ్​ను ప్రత్యక్షంగా వీక్షించాలని అభిమానులు భావించారు. అయితే పంజాబ్​ క్రికెట్​ అసోసియేషన్​ ఫ్యాన్స్​కు ఆ అవకాశాన్ని కల్పించట్లేదు. కొవిడ్​ నేపథ్యంలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించట్లేదని స్పష్టం చేసింది. దీంతో అభిమానులకు నిరాశే మిగిలింది.

శ్రీలంకతో టెస్టు సిరీస్​లో భాగంగా తొలి టెస్టు మొహాలీలోని ఐఎస్​ బింద్రా స్టేడియంలో జరగనుంది. మరో టెస్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది.

ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన విరాట్​ కోహ్లీ.. 50.39 సగటున 7962 పరుగులు చేశాడు. వీటిలో 27 శతకాలు ఉన్నాయి.

ఇదీ చూడండి : మహీ ఎన్నో విలువైన సూచనలు ఇచ్చాడు: పాక్​ ప్లేయర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.