ETV Bharat / sports

రుతురాజ్ సెంచరీ వృథా.. విజయ్​ హజారే ట్రోఫీని సొంతం చేసుకున్న సౌరాష్ట్ర

దేశవాళీ క్రికెట్​ టోర్నమెంట్​ విజయ్​ హజారే ట్రోఫీని సౌరాష్ట్ర కైవసం చేసుకుంది. మహరాష్ట్ర జట్టుతో జరిగిన ఫైనల్​లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. కాగా, రుతురాజ్​ గైక్వాడ్ సెంచరీ వృథా అయింది.

vijay hazare trophy 2022
vijay hazare trophy 2022
author img

By

Published : Dec 2, 2022, 6:57 PM IST

Updated : Dec 2, 2022, 7:09 PM IST

ప్రతిష్ఠాత్మక దేశవాళీ క్రికెట్​ టోర్నమెంట్​ విజయ్​ హజారే ట్రోఫీని సౌరాష్ట్ర జట్టు కైవసం చేసుకుంది. అహ్మదాబాద్​ వేదికగా జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో ఐదు వికెట్ల తేడాతో సౌరాష్ట్ర గెలుపొందింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్​లో 249 పరుగుల భారీ లక్ష్యాన్ని 46.3 ఓవర్లలోనే ఛేదించింది. కాగా మహరాష్ట్ర సారథి రుతురాజ్ గైక్వాడ్ చేసిన శతకం వృథా అయ్యింది. ఇక సౌరాష్ట్ర ప్లేయర్​ షెల్డన్‌ జాక్సన్‌ ఒంటరి పోరాటం చేశాడు. జాక్సన్‌ 133 పరుగులు బాది నాటౌట్‌గా నిలిచాడు. చివరి వరకు పోరాడి జట్టును విజయ తీరాలకు నడిపించాడు. హార్వక్​ దేశాయి(50) రాణించాడు. చిరాగ్​ జాని(30) ఫర్వాలేదనిపించాడు.
మొదట టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన మహరాష్ట్ర.. నిర్ణీత 50 ఓవర్లలో 248 పరుగులు చేసింది. రుతురాజ్​ గైక్వాడ్​ 108 పరుగులతో అదరగొట్టాడు. మిగతా బ్యాటర్లు బచావ్(27), అజిమ్ కాజి(37), సౌషద్​(31) ఫర్వాలేదనిపించారు.

సౌరాష్ట్ర సంబరాలు..
మ్యాచ్​ గెలిచిన తర్వాత సౌరాష్ట్ర జట్టు ఆటగాళ్లు మైదానంలో సంబరాలు చేసుకున్నారు. ఆ జట్టు కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్.. గ్రౌండ్‌ను ముద్దాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇప్పటివరకూ సౌరాష్ట్ర జట్టు రెండుసార్లు విజయ్ హజారే ట్రోఫీని దక్కించుకుంది.

ఇవీ చదవండి : కామెంటరీ చేస్తుండగా రికీ పాంటింగ్​కు గుండెపోటు​.. ఆస్పత్రికి తరలింపు!

ఇన్​స్టాలో ఈ మహిళా క్రికెటర్స్​కు​ క్రేజ్​ మామూలుగా లేదుగా

Last Updated : Dec 2, 2022, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.