ETV Bharat / sports

ఊర్వశి రౌతేలా చేసిన ఆ పని పంత్​ కోసమేనా? - ఊర్వశి రౌతేలా ఆస్ట్రేలియా టూర్​

బాలీవుడ్​ బ్యూటీ ఊర్వశి రౌతేలా తాజాగా చేసిన ఇన్​స్టా పోస్ట్ వైరల్​గా మారింది. నెటిజన్లంతా ఆమె.. క్రిికెటర్​ పంత్​ కోసమే ఇలా చేసిందని భావిస్తున్నారు. ఆ సంగతులు..

rishab pant
urvasi rautela
author img

By

Published : Oct 9, 2022, 4:44 PM IST

బాలీవుడ్​ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. అటు బీ టౌన్​లోనూ ఇటు క్రికెట్​ అభిమానుల నోటిలో ప్రస్తుతం నానే ఏకైక పేరు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మకు కొంతకాలం నుంచి స్టార్​ క్రికెటర్​ రిషభ్​ పంత్​తో సోషల్​​ మీడియా వార్ కొనసాగడమే ఇందుకు కారణం.​ వీరిద్దరూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ నెటింట్లో హాట్​టాపిక్​గా మారారు. ముఖ్యంగా ఊర్వశి.. పంత్​ పేరు ప్రస్తావించకుండానే అతడి గురించి ఏదో ఒకటి పరోక్షంగా పోస్ట్​లు పెడుతూనే ఉంటుంది. తాజాగా ఆమె చేసి ఓ పోస్ట్​ ప్రస్తుతం మళ్లీ వైరల్​ అయింది. ఏంటంటే.. ఆమె ఇటీవలే ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇన్​స్టాలో ఓ ఫొటో షేర్​ను చేసింది. "మనసును ఫాలో అయ్యా అది నన్ను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లింది" అని రాసుకొచ్చింది. అయితే పంత్​ కూడా సిరీస్​లో భాగంగా అక్కడే ఉన్నాడు. దీంతో ఊర్వశి పోస్ట్​ చూసిన అభిమానులు.. ఆమె రిషభ్​ కోసమే వెళ్లిందని విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. కలిసేందుకు వెళ్తోందని కామెంట్లు పెట్టడం ప్రారంభించారు.

ఇంకొంత మంది అభిమానులు ఆగ్రహిస్తూ ఆమెను ట్రోల్​ చేయడం ప్రారంభించారు. రిషబ్​ను ఈమె వదిలేలా లేదని అంటున్నారు. "నువ్వు నిజంగానే రిషభ్​​ను ఫాలో అవుతూ ఆస్ట్రేలియాకు వెళ్లావా??" అని ఇంకొంతమంది అడుగుతున్నారు. కాగా, ఇటీవలే ఆసియాకప్​లో భాగంగా జరిగిన మ్యాచ్​లకు కూడా రౌతేలా హాజరై ట్రోలింగ్​కు గురైంది. ఇక ఇటీవలే పంత్​ బర్త్​డే రోజున కూడా ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఎర్ర డ్రెస్సుల్లో కనపడి సందడి చేసిన ఆమె.. హ్యాపీ బర్త్​డే అంటూ క్యాప్షన్​ జోడించింది. దీంతో ఆ విషెస్​ రిషబ్​కే అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

ఇక అక్టోబర్​ 7న ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్​ కోసం కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికే ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుని ప్రాక్టీస్ సెషన్​ ప్రారంభించారు. మరికొంతమంది ప్లేయర్స్​ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​ ఆడుతున్నారు. ఇది పూర్తవ్వగానే వారు కూడా ఆస్ట్రేలియాకు వెళ్తారు. కాగా, ఈ వరల్డ్​ కప్​లో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్​ను అక్టోబర్​ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో తలపడనుంది.

ఇదీ చదవండి:

ఆమె లేకపోతే ఈరోజు నేను ఉండేదాన్ని కాదేమో!: దీపికా పదుకొణె

ఆ పిచ్​పై స్పెషల్​ ప్లాన్​తో బరిలోకి దిగాలి: సూర్యకుమార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.