ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)(Big Bash League 2021)లో ఆడే తొలి భారతీయ ఆటగాడు కానున్నాడు టీమ్ఇండియా అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్(Unmukt Chand news). ఆగస్టులో భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇతడు బీబీఎల్‌కు చెందిన మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ జట్టు యాజమాన్యం తెలిపింది.
"మెల్బోర్న్ రెనెగేడ్స్‌లో చేరడం చాలా ఆనందంగా ఉంది. బిగ్బాష్ను బాగా ఫాలో అయ్యేవాడిని. మంచి క్రికెట్ ఆడేందుకు ఇది నాకు ఓ సదవకాశం. మెల్బోర్న్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నా."
-ఉన్ముక్త్ చంద్, అండర్-19 మాజీ కెప్టెన్.
రిటైర్మెంట్ అనంతరం యూఎస్ఏలో లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు ఉన్ముక్త్. బీబీఎల్‌లో అవకాశం రావడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాలో ఆడేందుకు ఇష్టపడతానని తెలిపాడు. కాగా, మెల్బోర్న్ రెనెగేడ్స్ 2018-19 బీబీఎల్ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచింది.
-
The @RenegadesBBL make history with their latest #BBL11 signing - @UnmuktChand9 becomes the first ever male Indian player in the BBL! 🇮🇳 pic.twitter.com/bMlZ3xBgxP
— KFC Big Bash League (@BBL) November 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The @RenegadesBBL make history with their latest #BBL11 signing - @UnmuktChand9 becomes the first ever male Indian player in the BBL! 🇮🇳 pic.twitter.com/bMlZ3xBgxP
— KFC Big Bash League (@BBL) November 4, 2021The @RenegadesBBL make history with their latest #BBL11 signing - @UnmuktChand9 becomes the first ever male Indian player in the BBL! 🇮🇳 pic.twitter.com/bMlZ3xBgxP
— KFC Big Bash League (@BBL) November 4, 2021
-
Big news... @UnmuktChand9 🔒
— Melbourne Renegades (@RenegadesBBL) November 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
The former India A and India U19 captain is officially a Renegade!#GETONRED
">Big news... @UnmuktChand9 🔒
— Melbourne Renegades (@RenegadesBBL) November 4, 2021
The former India A and India U19 captain is officially a Renegade!#GETONREDBig news... @UnmuktChand9 🔒
— Melbourne Renegades (@RenegadesBBL) November 4, 2021
The former India A and India U19 captain is officially a Renegade!#GETONRED
2012లో సారథిగా టీమ్ఇండియాకు అండర్-19 ట్రోఫీ అందించాడు ఉన్ముక్త్. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ నమోదు చేశాడు. అనంతరం ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. దిల్లీ, ముంబయి, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ, అంచనాలను అందుకోలేక అంతర్జాతీయ జట్టులో అవకాశం పొందలేకపోయాడు.
ఇదీ చదవండి: