U19 Asia Cup 2021: అండర్-19 ఆసియా కప్ సెమీఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచిన బంగ్లాదేశ్.. భారత్‌తో గురువారం సెమీఫైనల్ ఆడనుంది. ముందే సెమీస్‌కు అర్హత పొందిన బంగ్లాదేశ్, శ్రీలంక.. గ్రూప్‌లో అగ్రస్థానం నిర్ణయించే మ్యాచ్‌లో మంగళవారం పోటీపడ్డాయి. అయితే ఇద్దరు అధికారులకు కరోనా నిర్ధరణ కావడం వల్ల ఈ మ్యాచ్‌ను అర్ధాంతరంగా రద్దు చేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి బంగ్లా 32.4 ఓవర్లలో 4 వికెట్లకు 130 పరుగులు చేసింది. గ్రూప్‌లో మెరుగైన రన్‌రేట్ కలిగిన ఆ జట్టుకే అగ్రస్థానం లభించింది.
మరో సెమీఫైనల్లో పాకిస్థాన్‌తో శ్రీలంక తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు నాలుగుసార్లు (2000, 2008, 2012, 2018) టైటిల్ గెలిచింది. 2016, 2020లో రన్నరప్‌గా నిలిచింది.
ఇదీ చదవండి:
Cricket Rewind 2021: క్రికెట్లో అరుదైన ఫీట్లు.. ఈ ఏడాది తక్కువే!