ETV Bharat / sports

Teja Nidamanuru Netherlands : నెదర్లాండ్స్​ జట్టులో తెలుగు తేజం.. అతిథిగా వచ్చేస్తున్నాడుగా! - తేజ నిడమనూరు సెంచరీ

Teja Nidamanuru Netherlands : రానున్న వన్డే ప్రపంచకప్​కు సర్వం సిద్ధమైంది. భారత్​లోని పలు వేదికలపై జరగనున్న ఈ మ్యాచ్​లను ఆడేందుకు ఎన్నో జట్లు రానున్నాయి. అందులో నెదర్లాండ్స్‌ ఒకటి. అయితే ఈ జట్టులో మన తెలుగు కుర్రాడు ఉన్నాడు. అతనే తేజ నిడమనూరు. విజయవాడలో పుట్టి.. న్యూజిలాండ్‌లో పెరిగి పెద్దవాడైన తేజ.. ఇప్పుడు నెదర్లాండ్స్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే తేజ జర్నీలో కొన్ని ఆసక్తికర మలుపులున్నాయి. అవేంటంటే..

Teja Nidamanuru Netherlands
Teja Nidamanuru Netherlands
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 7:15 AM IST

Teja Nidamanuru Netherlands : రానున్న వన్డే ప్రపంచకప్​లో ఎన్నో చిన్న జట్లు తలపడుతున్నాయి. అందులో నెదర్లాండ్స్‌ ఒకటి. ఇక ప్రపంచకప్‌లో ఆ జట్టు తరఫున ఆడనున్న ప్లేయర్ల లిస్ట్​ చూస్తే.. అందులో మ్యాక్స్‌ ఒడౌడ్‌, బాస్‌ డిలీడ్‌, స్కాట్‌ ఎడ్వర్డ్స్‌, ఆకర్‌మ్యాన్‌.. ఇలా అన్నీ ఆ దేశానికి తగ్గ పేర్లే కనిపిస్తాయి. అయితే అందులో ఓ పేరు మాత్రం మనకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ పేరే.. తేజ నిడమానూరు. చూస్తుంటే ఇదేదో తెలుగు పేరులా ఉందే.. ఇతను మనవాడేనా అని మనకు సందేహం కలగచ్చు. అవును నిజమే.. అతను మన తెలుగు కుర్రాడే. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తన మూలాలు ఉన్నాయి. అయితే చిన్న వయసు నుంచి అతను భారత్​లో లేడు. విజయవాడలో పుట్టి.. న్యూజిలాండ్‌లో పెరిగి పెద్దవాడైన తేజ.. ఇప్పుడు నెదర్లాండ్స్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే తేజ జర్నీలో కొన్ని ఆసక్తికర మలుపులున్నాయి.

Teja Nidamanuru Birth Place : విజయవాడకు చెందిన తేజ చిన్నతనంలోనే తండ్రికి దూరమయ్యాడు. దీంతో ఉద్యోగ రీత్యా తల్లి అతణ్ని తీసుకుని న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు వెళ్లారు. అక్కడ ఆమె డయాలసిస్‌ టెక్నీషియన్‌గా పని చేస్తూ.. కొడుకును చదివించారు. అయితే తేజ స్కూలింగ్​ పూర్తి చేసే సమయానికి కొన్ని ఇబ్బందుల వల్ల తల్లి విజయవాడకు తిరిగొచ్చేశారు. అప్పటికి తేజ వయసు 16 ఏళ్లు. అయితే తల్లితో పాటు అతను ఇక్కడికి రాలేదు. ఒక్కడే ఆక్లాండ్‌లో ఉండిపోయి.. అక్కడే ఓ అద్దె గదిలో ఉంటూ పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తూ సొంతంగా చదువుకున్నాడు. అలా స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌లో డిగ్రీలు పూర్తి చేయడమే కాకుండా ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గానూ సత్తా చాటాడు.

మరోవైపు న్యూజిలాండ్‌ లిస్ట్‌-ఎ క్రికెట్లో కూడా అతను ఆడాడు. ప్రస్తుత న్యూజిలాండ్‌ జట్టులో సభ్యులైన ఫిలిప్స్‌, చాప్‌మన్‌ లాంటి క్రికెటర్లతో కలిసి తేజ వివిధ వయసు విభాగాల మ్యాచ్‌లు ఆడాడు. అయితే న్యూజిలాండ్‌ క్రికెట్​లో ఓ స్థాయికి మించి అతను ఎదగలేకపోయాడు. బోర్డు కాంట్రాక్టును కూడా సంపాదించలేకపోయాడు. సరిగ్గా అదే సమయంలో నెదర్లాండ్స్‌లో ఒక క్లబ్‌ టోర్నీ ఆడే అవకాశం తేజకు లభించింది. దీంతో కొన్ని రోజులు మ్యాచ్‌లు ఆడి తిరిగి ఆక్లాండ్‌కు వెళ్లిపోవాలన్నది తేజ ఆలోచన. అయితే అతడితో మ్యాచ్‌ ఆడిన ఓ వ్యక్తి ఓ కంపెనీకి సీఈవో కాగా.. మాటల మధ్యలో తన విద్యార్హతల గురించి చెప్పడం వల్ల ఆ కంపెనీలో జాబ్​ ఆఫర్‌ చేశాడు.

అప్పుడే తేజకు నెదర్లాండ్స్‌లో స్థిరపడే ఆలోచన వచ్చింది. ఈ క్రమంలో ముందుగా ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత స్థానిక క్రికెట్‌ క్లబ్‌లకు ఆడటం మొదలుపెట్టాడు. అలా నెదర్లాండ్స్‌ జాతీయ జట్టుకు ఆడే అవకాశాన్ని సంపాదించాడు. అయితే నెదర్లాండ్స్‌ ఏడాదిలో ఆడేది తక్కువ మ్యాచ్‌లే కావడం వల్ల కొంత కాలం ఉద్యోగం చేస్తూనే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక జట్టులో నిలదొక్కుకున్నాక అతడికి ఆటగాడిగా కాంట్రాక్టుతో పాటు తన విద్యార్హతలకు తగ్గట్లు మేనేజ్‌మెంట్‌ ఓ ఉద్యోగం కూడా ఇచ్చింది. ఆర్థికంగా మరీ గొప్ప స్థాయిలో లేకపోయినప్పటికీ.. జీవితం సాఫీగానే సాగిపోతోందని అంటున్నాడు తేజ.

వెస్టిండీస్‌కు చెక్‌.. ఆ దెబ్బతో వరల్డ్​కప్​కు దూరం..
Teja Nidamanuru Century : రెండుసార్లు ఛాంపియన్‌ అయిన వెస్టిండీస్‌.. చరిత్రలో తొలిసారి వన్డే ప్రపంచకప్‌కు దూరమైంది. 2023 ప్రపంచకప్‌కు ఆ జట్టు అర్హత సాధించకపోవడానికి ముఖ్య కారణం తేజనే. క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఆ జట్టుకు చెక్‌ పెట్టింది కూడా అతనే. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ 375 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. తేజ సంచలన సెంచరీ (76 బంతుల్లో 111) సాధించడం వల్ల ఆ మ్యాచ్‌ కాస్త టై అయింది. ఇక ఆ తర్వాత వేసిన సూపర్‌ ఓవర్​లో నెదర్లాండ్సే విజయం సాధించింది. ఈ ఓటమి తర్వాత పుంజుకోలేక విండీస్‌ ప్రపంచకప్‌కు దూరమైంది. ఈ ఇన్నింగ్స్‌తోనే డచ్‌ జట్టులో తేజ స్థానం సుస్థిరమైంది. ఈ క్రమంలో అతను ప్రపంచకప్‌లోనూ ఆడే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. ఇక హైదరాబాద్‌ వేదికగా అక్టోబరు 6న పాకిస్థాన్‌తో నెదర్లాండ్స్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు తేజ కుటుంబసభ్యులతో పాటు అతని బంధువులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు.

ICC World Cup 2023 Qualifiers : విండీస్​పై నెదర్లాండ్స్​ 'సూపర్​ విక్టరీ'.. మెరిసిన తెలుగు తేజం..

Netherlands World Cup Squad 2023 : ప్రపంచ కప్‌ జట్టులో తెలుగు కుర్రాడికి చోటు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.