ETV Bharat / sports

Ind Vs Nz: లంచ్ విరామం.. భారీ ఆధిక్యంలో టీమ్​ఇండియా - న్యూజిలాండ్​​ లక్ష్యం

Team india vs New zealand 2021:న్యూజిలాండ్​తో రెండో టెస్టు మూడో రోజు ఆట తొలి సెషన్​ పూర్తయ్యేసరికి టీమ్​ఇండియా రెండో ఇన్నింగ్స్​లో 142/2 పరుగుల నిలిచింది. క్రీజులో గిల్, కోహ్లీ ఉన్నారు.

టీమ్​ఇండియా వర్సెస్​ న్యూజిలాండ్​ సెకండ్​ టెస్ట్​, Teamindia vs newzealand second test, teamindia declare
టీమ్​ఇండియా వర్సెస్​ న్యూజిలాండ్​ సెకండ్​ టెస్ట్​
author img

By

Published : Dec 5, 2021, 11:37 AM IST

Updated : Dec 5, 2021, 11:52 AM IST

Team india vs New zealand 2021: న్యూజిలాండ్​తో రెండో టెస్టు మూడో రోజు లంచ్​ విరామానికి​ టీమ్ఇండియా 2 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఫలితంగా 405 పరుగుల ఆధిపత్యంలో ఉంది. క్రీజులో గిల్(17*), కోహ్లీ(11*) ఉన్నారు.

69/0తో మూడో రోజు ఆట ప్రారంభించింది టీమ్​ఇండియా. ఈ క్రమంలోనే 32వ ఓవర్​లో​ దగ్గర మయాంక్ అగర్వాల్​ను(62) దెబ్బ తీశాడు కివీస్​ స్పిన్నర్​ అజాజ్​ పటేల్​. రెండో టెస్టులో ఇతడికి ఇది 11వ వికెట్​ కావడం విశేషం.​ మయాంక్​ భారీ షాట్​ ఆడబోయి విలయంగ్​ చేతికి చిక్కాడు. దీంతో భారత్​ రెండో ఇన్నింగ్స్​లో 107 పరుగుల వద్ద తొలి వికెట్​ కోల్పోయింది.

అనంతరం పుజారా(47) కూడా అజాజ్​ వేసిన 36వ ఓవర్​ చివరి బంతికి స్లిప్​లో రాస్​టేలర్​ చేతికి చిక్కాడు. అయితే, బంతి నేలకు తాకేలా అనిపించడం వల్ల థర్డ్​ అంపైర్​ పలు విధాలుగా పరిశీలించి చివరికి ఔటిచ్చాడు. దీంతో భారత్​ 115 పరుగుల వద్ద రెండో వికెట్​ను కోల్పోయింది.

ఇదీ చూడండి: భారత్ భళా.. కివీస్​పై భారీ అధిక్యం

Last Updated : Dec 5, 2021, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.