ETV Bharat / sports

టీమ్ఇండియాకు షాక్.. డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత.. పాక్ కంటే దిగువకు.. - టీమ్​ఇండియా ఐదో టెస్టు

Teamindia WTC Points: ఇంగ్లాండ్​తో జరిగిన ఐదో టెస్టులో ఓడిన టీమ్​ఇండియాకు.. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో మరో చేదు అనుభవం ఎదురైంది. ఈ మ్యాచ్​లో స్లో ఓవర్​ రేటు కారణంగా మ్యాచ్​ ఫీజులో 40 శాతం కోత విధించడం సహా 2 పాయింట్లను తగ్గించింది ఐసీసీ.

Teamindia WTC Points
టీమ్​ఇండియా డబ్ల్యూటీసీ పాయింట్లు
author img

By

Published : Jul 6, 2022, 1:09 PM IST

Teamindia WTC Points: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో టీమ్​ఇండియాకు మరోసారి షాక్​ తగిలింది. ఇప్పటికే ఇంగ్లాండ్​తో జరిగిన ఐదో టెస్టులో ఓడి సిరీస్​ను పంచుకోవాల్సి వచ్చిన భారత జట్టుకు.. ఫైన్ విధించింది ఐసీసీ. ఈ మ్యాచ్​లో స్లో ఓవర్​రేటు కారణంగా మ్యాచ్​ ఫీజులో 40 శాతం కోత విధించడంతో పాటు 2 పాయింట్లను తగ్గించింది.

ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ సైకిల్​లో టీమ్​ఇండియా స్లో ఓవర్​రెట్​ కారణంగా పాయింట్లు కోల్పోవడం ఇది మూడోసారి. అంతకుముందు ఇదే సిరీస్​లోని నాటింగ్​హామ్ టెస్టులో రెండు పాయింట్లు, దక్షిణాఫ్రికాతో జరిగిన సెంచూరియన్​​ టెస్టులో ఓ పాయింట్ కోల్పోయింది. తాజాగా ఎడ్జ్​బాస్టన్​లోనూ రెండు పాయింట్ల కోత విధించడం వల్ల మొత్తంగా ఐదు పాయింట్లు నష్టపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో భారత జట్టు 52.8 శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది. దాయాది దేశం పాకిస్థాన్​ 52.38 శాతంతో మూడో స్థానానికి ఎగబాకింది.

6 మ్యాచ్​లకు 6 గెలవాలి.. పాయింట్స్​ టేబుల్​లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్​ మ్యాచ్​ ఆడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్​ఇండియా ఫైనల్​ చేరడం కష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ సైకిల్​లో భాగంగా భారత్​ ఆడనున్న తదుపరి సిరీస్​లోని 6 మ్యాచ్​లకు 6 గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెప్టెంబరు-అక్టోబర్​ మధ్య సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో 4 టెస్టుల్లో తలపడనుంది. అలాగే బంగ్లాదేశ్ పర్యటనలో రెండు మ్యాచులు ఆడనుంది. ఈ రెండు సిరిస్​ల్లోని మొత్తం 6 మ్యాచ్​లలో ఆరు గెలిస్తే.. టీమ్​ఇండియా 68కిపైగా విన్నింగ్​ పర్సంటేజి వచ్చి ఫైనల్​ చేరే అవకాశాలు ఉంటాయి. అయితే అదే సమయంలో ఇతర జట్ల ఫలితాలను పరిశీలించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: టీమ్​ఇండియా ఓటమిపై ద్రవిడ్​ అలా.. బుమ్రా ఇలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.