ETV Bharat / sports

టీ20​ ప్రపంచకప్​ షురూ.. ఇవి తెలుసుకోండి.. - టీమ్​ ఇండియా జట్టు

దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత పురుషుల టీ-20 క్రికెట్​ ప్రపంచకప్ (T20 world cup 2021)​ జరుగుతోంది. ఇక నెల రోజులు క్రికెట్​ అభిమానులకు పండగే. ఐపీఎల్​ ముగిసిన రెండు రోజుల్లోనే మహా క్రీడా సంగ్రామానికి తెరలేచింది. అయితే.. ఈ టీ-20 ప్రపంచకప్(T20 world cup 2021)​ ఎలా జరుగుతుంది? షెడ్యూల్? (T20 world cup 2021 schedule)​ మ్యాచ్​లు ఏ సమయానికి? ఎక్కడ వీక్షించొచ్చు? భారత్​ తొలి మ్యాచ్​ ఎప్పుడు? ఇవన్నీ తెలుసుకోండి..

T20 World Cup 2021
క్రికెట్​ ప్రపంచకప్
author img

By

Published : Oct 17, 2021, 5:36 PM IST

క్రికెట్​ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచేందుకు టీ-20 ప్రపంచకప్(T20 world cup 2021)​ వచ్చేసింది. గ్రూప్​ స్టేజీ మ్యాచ్​లు ఆదివారమే ప్రారంభమైనా.. సిసలైన పోరు అక్టోబర్​ 23 నుంచే. ఐదేళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్​ జరుగుతుండటం వల్ల అభిమానుల ఆనందానికి కొదువ లేదు. ఈ ఫార్మాట్​లో మొట్టమొదటిసారి విజేతగా నిలిచిన టీమ్​ ఇండియాతో (T20 world cup 2021 india team) పాటు.. ఇంగ్లాండ్​, డిఫెండింగ్​ ఛాంపియన్​ వెస్టిండీస్​ ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నాయి. యూఏఈ, ఒమన్​ వేదికగా మ్యాచ్​లు జరుగుతుండటం.. పాకిస్థాన్​కు కలిసివచ్చే విషయం. ఆ జట్టు కూడా గట్టి పోటీ నిచ్చే అవకాశాలున్నాయి. పసికూనలు అఫ్గానిస్థాన్​, బంగ్లాదేశ్​లనూ తక్కువ అంచనాలు వేయడానికి వీల్లేదు.

ప్రపంచకప్(T20 world cup 2021 schedule)​ నేపథ్యంలో ఇవి తెలుసుకోండి..

టీ-20 ప్రపంచకప్​ ఎక్కడ జరుగుతోంది?

వాస్తవానికి ఈ ప్రపంచకప్(T20 world cup 2021)​ భారత్​లో జరగాల్సింది. కరోనా కారణంగా వేదికను ఒమన్​, యూఏఈకి మార్చింది ఐసీసీ.

  • సూపర్​-12 క్వాలిఫయర్​ మ్యాచ్​లు మాత్రమే ఒమన్​లో జరగనున్నాయి.
  • సూపర్​-12, నాకౌట్​, ఫైనల్​ దుబాయ్​, షార్జా, అబుదాబిలో జరుగుతాయి.

ఎప్పటినుంచి ఎప్పటివరకు..?

అక్టోబర్​ 17 నుంచి నవంబర్​ 14 వరకు ప్రపంచకప్(T20 world cup 2021)​ జరగనుంది.

అయితే.. అక్టోబర్​ 22 వరకు జరిగేవి క్వాలిఫయర్​ మ్యాచ్​లే. 23 నుంచే అసలైన పోరు(T20 world cup 2021 schedule) మొదలయ్యేది.

అక్టోబర్​ 18,20 తేదీల్లో వార్మప్​ మ్యాచ్​లు జరుగుతాయి.

జట్లు, గ్రూప్​లు..

  • గ్రూప్​1: ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్​, ఏ1,బీ2
  • గ్రూప్​2: ఇండియా, పాకిస్థాన్​, న్యూజిలాండ్​, అఫ్గానిస్థాన్​, బీ1,ఏ2

పై 8 జట్లు నేరుగా సూపర్​-12కు అర్హత సాధించాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్, పపువా న్యూ గినియా, ఒమన్ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో అర్హత సాధించిన నాలుగు జట్లు సూపర్‌ 12లోకి ప్రవేశిస్తాయి.

గ్రూప్​-1, గ్రూప్​-2ల్లో తొలి 2 స్థానాల్లో నిలిచిన 4 జట్లు సెమీఫైనల్​ ఆడతాయి. అందులో గెలిచిన జట్లు ఫైనల్​కు(T20 world cup 2021 schedule) అర్హత సాధిస్తాయి. నవంబర్​ 14న దుబాయ్​ వేదికగా ఫైనల్​.

భారత్​ మ్యాచ్​లు ఎప్పుడు?

  • టీమ్​ ఇండియా(T20 world cup 2021 india team) తొలిమ్యాచ్​ను​ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో.. అక్టోబర్​ 24న ఆడనుంది.
  • అక్టోబర్​ 31న న్యూజిలాండ్​తో, నవంబర్​ 3న అఫ్గాన్​తో అమీతుమీ తేల్చుకోనుంది.
  • మరో రెండు మ్యాచ్​లను నవంబర్​ 5, 8న ఆడనుంది.

పాయింట్ల విధానం ఎలా?

గెలిస్తే 2 పాయింట్లు, టై/రద్దు అయిన సందర్భాల్లో ఒక పాయింట్​, ఓడితే జీరో పాయింట్లు లభిస్తాయి.

డీఆర్​ఎస్​ ఉందా?

పురుషుల టీ-20 ప్రపంచకప్​లో(T20 world cup 2021) తొలిసారి నిర్ణయ సమీక్ష విధానం(డీఆర్​ఎస్​) అమల్లోకి రానుంది. ప్రతి జట్టుకు ఇన్నింగ్స్​కు రెండుసార్లు డీఆర్​ఎస్​ అప్పీల్​ చేసుకునే అవకాశం ఉంటుంది.

రిజర్వ్​ డే ఉందా..

వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం లేదా మరే ఇతర పరిస్థితుల్లోనైనా మ్యాచ్​లు జరిగే అవకాశం లేనప్పుడు మాత్రమే రిజర్వ్​ డే ఉంది. అయితే.. ఇది నాకౌట్​ మ్యాచ్​లకు మాత్రమే.

గ్రూప్​ దశలో రిజర్వ్​ డే లేదు.

ప్రైజ్​మనీ ఎంత?

  • విజేతకు రూ. 12 కోట్లకుపైనే ప్రైజ్​మనీ దక్కనుంది.
  • రన్నరప్​కు రూ. 6 కోట్లు, సెమీఫైనల్​ చేరిన జట్లకు 3 కోట్ల రూపాయల చొప్పున దక్కనున్నాయి.

ఏ సమయానికి..?

వరల్డ్​కప్ (T20 world cup 2021 schedule) షెడ్యూల్​లో దాదాపు ప్రతిరోజూ రెండు మ్యాచ్​లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3.30 గంటలకు, సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్​లు ప్రారంభమవుతాయి.

ఎందులో వీక్షించొచ్చు?

టీ-20 ప్రపంచకప్​కు సంబంధించి అన్ని మ్యాచ్​లను.. స్టార్​ స్పోర్ట్స్​ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

హాట్​స్టార్​లోనూ లైవ్​ స్ట్రీమింగ్​ చూడోచ్చు.

ప్రేక్షకులకు అనుమతి ఉందా?

ఐపీఎల్​ల్లాగే.. ఇక్కడా ప్రేక్షకులకు అనుమతి ఉంది. యూఏఈలోని వేదికలన్నింటిలోనూ 70 శాతం సీటింగ్​ సామర్థ్యం కల్పించనుంది ఐసీసీ.

టీ-20 ప్రపంచకప్​ విజేతలు..

2007లో మొట్టమొదటిసారి జరిగిన టీ-20 ప్రపంచకప్​ను టీమ్​ ఇండియా నెగ్గింది. వెస్టిండీస్​ అత్యధికంగా రెండుసార్లు టైటిల్​ నెగ్గింది.

  • 2007- ఇండియా
  • 2009- పాకిస్థాన్​
  • 2010- ఇంగ్లాండ్​
  • 2012- వెస్టిండీస్​
  • 2014- శ్రీలంక
  • 2016- వెస్టిండీస్​

2022 టీ-20 ప్రపంచకప్​​ ఆస్ట్రేలియాలో జరగనుంది.

ఇవీ చూడండి: T20 World Cup 2021: మెగా టోర్నీలో భారత జట్టుదే పైచేయి!

T20 Worldcup: 'అలా చేస్తేనే టీమ్​ఇండియా గెలుస్తుంది'

'పాక్​తో మ్యాచ్.. టీమ్​ఇండియాకే సానుకూలత ఎక్కువ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.