ETV Bharat / sports

ఆల్​టైమ్ రికార్డ్ ప్రైజ్- వరల్డ్​కప్ విన్నింగ్​ కెప్టెన్​ రాకతో SRHలో నయా జోష్

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 2:57 PM IST

Updated : Dec 19, 2023, 4:22 PM IST

Sunrisers Hyderabad Pat Cummins : ఐపీఎల్​ చరిత్రలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారీ ధరకు అమ్ముడయ్యాడు. అతడ్నిసన్​రైజర్స్ రూ. 20.50కోట్లకు కొనుగోలు చేసింది.

sunrisers hyderabad pat cummins
sunrisers hyderabad pat cummins

Sunrisers Hyderabad Pat Cummins : 2024 ఐపీఎల్​ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్​ ప్యాట్ కమిన్స్ రికార్డు ధర పలికాడు. అతడ్ని సన్​రైజర్స్ హైదరాబాద్​ ఏకంగా రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల బేస్​ ప్రైజ్​ వద్ద ప్రారంభమైన బిడ్డింగ్​లో సన్​రైజర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. చివరికి ఈ బిడ్డింగ్ నుంచి బెంగళూర్ డ్రాప్ అవ్వండం వల్ల కమిన్స్​ను హైదరాబాద్​ సొతం చేసుకుంది. దీంతో ఇప్పటివరకు అత్యధితంగా ఉన్న శామ్ కరన్ (రూ. 18కోట్లు) రికార్డు బ్రేక్ అయ్యింది.

  • 𝑻𝒉𝒊𝒔 𝒍𝒊𝒕𝒕𝒍𝒆 PAT 𝒐𝒇 𝒍𝒊𝒇𝒆 𝒊𝒔 𝒄𝒂𝒍𝒍𝒆𝒅 𝑯𝒂𝒑𝒑𝒊𝒏𝒆𝒔𝒔 🧡

    Welcome, Cummins! 🫡#HereWeGOrange pic.twitter.com/qSLh5nDbLM

    — SunRisers Hyderabad (@SunRisers) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

SRH Buys IPL Auction 2024 : ఇప్పటివరకు జరిగిన వేలంలో సన్​రైజర్స్ నాణ్యమైన ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్​ను రూ. 6.80 కోట్లకు దక్కించుకోగా, శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగ రూ. 1.50 కోట్ల బేస్​ ప్రైజ్​కే కొనుగోలు చేసింది. ఇక ఈ ముగ్గురి ఫారిన్​ ప్లేయర్లతో జట్టులో విదేశీ స్లాట్​లు పూర్తయ్యాయి. ఇకపై సన్​రైజర్స్ భారత్ ప్లేయర్లనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టీమ్ఇండియా పేసర్ జయదేవ్ ఉనాద్కత్​ రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేసింది సన్​రైజర్స్. దీంతో సన్​రైజర్స్ ఇప్పటివరకు ఈవేలంలో మొత్తం 4 ఆటగాళ్ల (3 ప్లేయర్లు) ను కొనుగోలు చేసింది. జట్టులో ఇంకా రెండు స్లాట్​లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం సన్​రైజర్స్​ వద్ద రూ. 3.6 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం నుంచే మిగిలిన ఇద్దర్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

సన్​రైజర్స్ రిటైన్ ప్లేయర్ల లిస్ట్ : అబ్దుల్ సమద్‌, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్‌, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్‌ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, షాబాజ్‌ అహ్మద్‌ (ఆర్సీబీ నుంచి వచ్చాడు), అభిషేక్‌ శర్మ, మార్కో జాన్సన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్‌ సింగ్, భువనేశ్వర్‌ కుమార్‌, టి. నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, ఫజల్‌ హక్‌ ఫారూఖీ

అటు ఐపీఎల్- ఇటు బిజినెస్​లు​- కావ్య పాప ఆస్తులెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Sunrisers New Coach : లారాకు గుడ్​బై.. సన్​రైజర్స్​ కొత్త కోచ్​గా కివీస్​ లెజెండ్​

Last Updated : Dec 19, 2023, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.