Street Child Cricket World Cup 2023 : భారత్‌లో వన్డే క్రికెట్ ప్రపంచకప్ ఆరంభానికి ముందే ఈ స్ట్రీట్ చిల్డ్రన్ కప్ మొదలైంది.మిక్స్‌డ్ జండర్ ఈవెంట్‌గా జరుగుతున్నఈ టోర్నీ చెన్నై వేదికగా షురూ అయింది. వీధి బాలల్లో క్రికెట్ నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్నారు. భారత్‌తో పాటు ఇంగ్లాండ్, బురుండీ, హంగేరీ, మారిషస్, నేపాల్, బంగ్లాదేశ్, మెక్సికో, రువాండా, శ్రీలంక, సౌతాఫ్రికా నుంచి క్రికెటర్లు ఈ కప్‌లో పాల్గొననున్నారు. వీధి బాలల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రపంచకప్ జరగడం ఇది రెండోసారి.
ఒక్కొక్కరిది ఒక్కో గాథ
తినడానికి తిండి లేక.. ఉండటానికి సరైన ఇళ్లు లేక.. నా అనే దిక్కులేక ఎన్నో బాధలు అనుభవించే వీధి బాలలు క్రికెట్ ఆడడం ఏంటి? అందులోనూ ప్రపంచకప్‌లో పోటీపడడం ఏంటి? అనే అనుమానాలు కొంత మందికి వస్తుంటాయి. కానీ క్రికెట్ ఆట మీద వారికి ఉన్న ప్రేమ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. కావాల్సిన సౌకర్యాలు లేకపోయినా వివిధ దాతలు, ఎన్‌జీవోల ద్వారా, ఆటలో నైపుణ్యం సంపాదించిన ఈ చిన్నారులు.. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో సత్తా చాటేందుకు బరిలోకి దిగనున్నారు. భారత జట్టులో సానియా, శ్రవణ్, జన్నత్, ఫర్జానా, సంధ్య లాంటి మేటి ప్లేయర్లు ఈ కప్‌లో పోటీపడుతున్నారు.
వాస్తవానికి ఇలాంటి ఈవెంట్లలో ఆడడమే పెద్ద కల. ఎందుకంటే పస్తులు ఉన్న స్థితి నుంచి ఇలా బ్యాట్, బాల్ చేతపట్టి మైదానంలోకి వచ్చి ఆడడం అనేది మామూలు విషయం కాదు. కులీ పని చేసే నాన్న, పని మనిషిగా పని చేసే అమ్మ.. ఇది జన్నత్ నేపథ్యం. ఆర్థిక ఇబ్బందులను కళ్లారా చూసిన ఆ చిన్నారి తమ ఇంట్లో వాళ్లకు చేదోడుగా ఉండాలని చదువు కూడా మానేసింది. కానీ ఓ ఎన్‌జీవో సాయంతో మళ్లీ తన చదువును కొనసాగిస్తోంది. చదువులోనే కాకుండా క్రికెట్లోనూ రాణిస్తూ ఇప్పుడు ప్రపంచకప్ ఆడుతోంది. మరోవైపు బిహార్‌కు చెందిన శ్రవణ్‌ను ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి చదువు చెప్పిస్తోంది. అతడ్ని క్రికెట్ లోకానికి పరిచయం చేసి బరిలోకి దింపనుంది. ఇక దిల్లీలోని ఓ మురికివాడకు చెందిన కరణ్‌ది కూడా ఇదే పరిస్థితి. కనీస సౌకర్యాలు లేని స్థితి నుంచి వచ్చిన ఈ కుర్రాడు ఆటను నేర్చుకుంటూ ఎదిగాడు. రైల్వే ట్రాక్‌ల పక్కన క్రికెట్ ఆడి మెరుగయ్యాడు.
17 దేశాలు..20 జట్లు.. కప్ ప్రతేకత అదే..
ఈ ప్రపంచకప్‌లో పోటీపడేందుకు ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల నుంచి 20 జట్లు పోటీపడుతున్నాయి. 168 మంది చిన్నారులు ఈ ఈవెంట్లలో పాల్గొననున్నారు. బాలికలు, బాలురు కలిసి ఆడడం ఈ కప్ ప్రత్యేకత. టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో ప్రతి జట్టులో ఆరుగురు సభ్యులు ఉంటారు. ప్రతి టీమ్‌లో ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలు ఆడుతారు. సలామ్ బాలక్ ట్రస్ట్, చెట్నా, హోప్ ఫౌండేషన్, బకెట్ లిస్ట్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, లాంటి సంస్థలు వీధి బాలల కోసం అండగా నిలుస్తూ.. వారికి అవసరమైన దుస్తులు, షూస్‌తో పాటు ఆహారం, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నాయి.
-
Glimpse of the Tournament Draw.
— Hello FM (@HelloFM1064) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Street Child Cricket World Cup 2023.
Featuring RJ Suresh as one of the five guests to pick the draw.
Official Radio Partner HELLO FM#HelloFM #Chennai #iamsomebody #sccwc2023 #streetchildcricketworldcup pic.twitter.com/QmFYxSTcF0
">Glimpse of the Tournament Draw.
— Hello FM (@HelloFM1064) September 25, 2023
Street Child Cricket World Cup 2023.
Featuring RJ Suresh as one of the five guests to pick the draw.
Official Radio Partner HELLO FM#HelloFM #Chennai #iamsomebody #sccwc2023 #streetchildcricketworldcup pic.twitter.com/QmFYxSTcF0Glimpse of the Tournament Draw.
— Hello FM (@HelloFM1064) September 25, 2023
Street Child Cricket World Cup 2023.
Featuring RJ Suresh as one of the five guests to pick the draw.
Official Radio Partner HELLO FM#HelloFM #Chennai #iamsomebody #sccwc2023 #streetchildcricketworldcup pic.twitter.com/QmFYxSTcF0
World Cup 2023 Prize Money : వామ్మో.. వరల్డ్ కప్ విజేత 'ప్రైజ్‌మనీ' ఎంతో తెలిస్తే షాకే!
T20 World Cup 2024 : 10 వేదికల్లో 55 మ్యాచులు.. ఐసీసీ అఫీషియల్ అనౌన్స్మెంట్