ETV Bharat / sports

Shubman Gill Opening : మా జోడీయే ప్రపంచకప్​లో భారత్​కు కీలకం.. ఓపెనింగ్ చేసేటప్పుడు అందరి దృష్టి అతడిపైనే : గిల్

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 8:16 PM IST

Shubman Gill Opening : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కొంతకాలంగా ఇన్నింగ్స్​ను ప్రారంభింస్తున్నాడు యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్. ఇక రానున్న వరల్డ్ కప్​లో కూడా వీరి ఓపెనిగ్ జోడీ.. జట్టుకు కీలకం కానుందని గిల్ అభిప్రాయపడ్డాడు.

Shubman Gill Opening
Shubman Gill Opening

Shubman Gill Opening : క్రికెట్​లో ఏ ఫార్మాట్లో అయినా జట్టు భారీ స్కోర్ సాధించాలంటే.. ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకం. అలా టీమ్ఇండియాలో కొద్ది కాలం నుంచి వన్డే, టీ20ల్లో కెప్టెన్​ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు శుభ్​మన్ గిల్. ఇక వీరి గణాంకాలు చూస్తే.. ఈ ఇద్దరిది సక్సెస్​ఫుల్ జోడీ అనే చెప్పవచ్చు. వన్డేల్లో టీమ్ఇండియా తరఫున ఈ జోడీ 9 సార్లు ఇన్నింగ్స్​ను ప్రారంభించి.. 76.11 సగటున 685 పరుగులు జోడించారు. అయితే హిట్​మ్యాన్​తో కలిసి నిలకడగా రాణించడానికి గల కారణాన్ని గిల్​ తాజాగా వెల్లడించాడు. మరి గిల్ ఏమన్నాడంటే..

క్రీజులో ఉన్నప్పుడు రోహిత్ ఆట తన బ్యాటింగ్​కు భిన్నంగా ఉంటుందని గిల్ తెలిపాడు. "రోహిత్ ఎంపిక చేసుకునే షాట్లు.. నా బ్యాటింగ్ శైలి భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా పవర్​ప్లే లో రోహిత్ ఒక దిశను లక్ష్యంగా చేసుకొని ఆడతాడు. నేను ఫీల్డర్ల మధ్య గ్యాప్​లో ఆడుతూ.. బౌండరీలు బాదడానికి ఇష్టపడతాను. కానీ అతడు బంతిని స్టాండ్స్​లోకి పంపాలనుకుంటాడు. ఈ కాంబినేషన్​ అద్భుతంగా ఆడడానికి సక్సెస్​ ఫార్ములాలా పనిచేస్తుంది. ఆలాగే అతడితో ఇన్నింగ్స్​ను ప్రారంభించడం గొప్ప అనుభుతినిస్తుంది. క్రీజులో నాకు నచ్చినట్లు ఆడేందుకు రోహిత్ పూర్తి స్వేచ్ఛనిస్తాడు. ఇక అందరి దృష్టి అతడిపైనే ఉంటుందని తెలుసు " అని గిల్​ అన్నాడు. ఇక రానున్న ప్రపంచకప్​లో కూడా వారి ఓపెనింగ్​ భాగస్వామ్యాం జట్టుకు కీలకం కానుందని గిల్​ పేర్కొన్నాడు.

Shubman Gill Odi Stats : వన్డేల్లో 27 మ్యాచ్​లు ఆడిన గిల్.. 62.48 సగటున, 104.06 స్ట్రైక్ రేట్​తో 1381 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, ఆరు అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్​ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో గిల్.. డబుల్ సెంచరీ (208) సాధించాడు. దీంతో వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా గిల్ రికార్డు క్రియేట్ చేశాడు.

Shubman Gill Odi Ranking : ఇక ఐసీసీ బుధవారం తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో గిల్ 743 పాయింట్లతో​ నాలుగో స్థానం దక్కించుకున్నాడు. కాగా ఇది గిల్ కెరీర్​లో బెస్ట్ ర్యాంక్.

Subhman Gil IPL : కొత్త తరానికి సూపర్​ స్టార్​.. కప్పు కొట్టకున్నా ఛాంపియనే!

ICC Latest T20 Rankings : ర్యాంకింగ్​లోకి దూసుకొచ్చిన జైస్వాల్​​.. కెరీర్​ బెస్ట్​లో గిల్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.