ETV Bharat / sports

ఇంకా అలానే శ్రేయస్​.. రెండో టెస్టుకు కూడా.. - ఇండియా vs ఆస్ట్రేలియా రెండో టెస్ట్​ న్యూస్

దిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి భారత్​.. ​ ఆస్ట్రేలియాతో మరోసారి తలపడనుంది. అయితే ఆసిస్​తో జరగనున్న ఈ రెండో టెస్టుకు ముందే టీమ్​ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెన్నెముక గాయంతో గత కొంత కాలంగా క్రికెట్​కు దూరంగా ఉన్న శ్రేయస్‌ అయ్యర్ ఇప్పుడు రెండో టెస్టుకు కూడా దూరమవ్వనున్నాడట.

shreyas iyer
shreyas iyer
author img

By

Published : Feb 14, 2023, 12:40 PM IST

ఫిబ్ర‌వ‌రి 17 నుంచి జ‌రగ‌నున్న ఆస్ట్రేలియా-భారత్​ రెండో టెస్ట్​కు ముందే టీమ్​ ఇండియాకు భారీ షాక్​ తగిలింది. ఈ టెస్ట్‌కు కూడా స్టార్​ ప్లేయర్​ శ్రేయ‌స్ అయ్య‌ర్ గైర్హాజరయ్యే అవకాశాలున్నాయని సమాచారం. కాగా వెన్ను గాయంతో తొలి టెస్ట్‌కు దూర‌మైన అయ్య‌ర్‌.. నేష‌న‌ల్ క్రికెట్ అకాడెమీలో చికిత్స‌ పొందుతున్నాడు. అయితే ఇటీవలే త‌న ట్రైనింగ్ సెష‌న్‌కు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అతడు మ్యాచ్​కు వస్తాడని సంతోషం వ్యక్తం చేశారు అభిమానులు. కానీ గాయం తీవ్ర‌త ఇంకా త‌గ్గ‌క‌పోవ‌డంతో అత‌డి అందిస్తున్న రిహాబిలిటేష‌న్‌ను కంటిన్యూ చేయాల‌ని ఎన్‌సీఏ వ‌ర్గాలు నిర్ణ‌యించుకున్న‌ాయని స‌మాచారం.

మరోవైపు గ‌త నెల రోజులుగా క్రికెట్​కు శ్రేయ‌స్ అయ్య‌ర్ దూరంగానే ఉన్నాడు. అయితే ఫిట్‌నెస్ సామ‌ర్థ్యాలు తెలియ‌కుండా డైరెక్ట్‌గా టెస్ట్ మ్యాచ్ ఆడించి రిస్క్ తీసుకోకూడ‌ద‌ని అనుకున్న మేనేజ్​మెంట్​.. అత‌న్ని రెండో టెస్ట్​కు ఎంపిక చేయకూడదని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. అటు ఫిటెన్‌స్ సామ‌ర్థ్యం నిరూపించుకోవ‌డానికి ప్ర‌స్తుతం రంజీ ట్రోఫీ ఆడే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. దీంతో శ్రేయ‌స్ రెండో టెస్ట్‌తో పాటు మిగిలిన టెస్ట్‌ల‌కు దూరమయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

కాగా, తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది టీమ్​ఇండియా. ఈ నేప‌థ్యంలో రెండు టెస్ట్ కోసం తుది జ‌ట్టులో మార్పులు చేయ‌క‌పోవ‌చ్చన‌ని క్రికెట్ వ‌ర్గాల సమాచారం​. జ‌ట్టు కూర్పు దెబ్బ‌తిన‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌లో ఉన్న మేనేజ్‌మెంట్ అదే జట్టును.. రెండో టెస్టు బ‌రిలో దించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఫిబ్ర‌వ‌రి 17 నుంచి 21 వ‌ర‌కు దిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఆసిస్​కు భారత్​ మధ్య రెండోటెస్ట్ మ్యాచ్ జ‌రుగ‌నుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.