ETV Bharat / sports

వైడ్ ఇవ్వలేదని చిందులు.. అంపైర్​పైకి దూసుకెళ్లిన షకిబ్.. వీడియో చూశారా?

బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ మరోసారి మైదానంలో అసహనం ప్రదర్శించాడు. అంపైర్‌ నిర్ణయాన్ని తప్పుపడుతూ అతడిపై మండిపడ్డాడు.

shakib-screams-at-umpire
shakib-screams-at-umpire
author img

By

Published : Jan 8, 2023, 9:44 PM IST

బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ ప్రవర్తన మరోసారి వివాదాస్పదంగా మారింది. మ్యాచ్‌లో తాను ఊహించిన ఫలితం రాని సమయంలో అంపైర్లపై చిందులు వేయడం, వికెట్లను నేలకేసి కొట్టడం వంటివి చేసి ఈ ఆటగాడు పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచాడు. తాజాగా మరోసారి షకిబ్‌ నియంత్రణ కోల్పోయాడు. వైడ్ బాల్‌ విషయంలో అంపైర్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

చట్‌గావ్‌ వేదికగా ఆ దేశ ప్రీమియర్‌ లీగ్‌(బీపీఎల్‌) 2023 శుక్రవారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బౌన్సర్‌ షకిబ్‌ను దాటి వెళ్లాడు. దీనిని అంపైర్‌ వైడ్‌గా ప్రకటించలేనన్నాడు. ఆ డెలివరీ సరైందేనని.. ఓవర్‌లో తొలి బౌన్సర్‌ ఇదేనని అంపైర్‌ తెలిపాడు. దీంతో ఈ ఆటగాడు మరోసారి సహనం కోల్పోయి ప్రవర్తించాడు. క్రీజు వదిలి అంపైర్‌ దగ్గరకు వెళ్లి అతడితో వాదనకు దిగడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

2021లో ఢాకాలో జరిగిన బీపీఎల్​లో సైతం షకిబ్‌ ప్రవర్తన వివాదాస్పదమైంది. షకిబ్‌ను విలన్‌గా చిత్రీకరించేలా మీడియా ప్రయత్నిస్తోందంటూ అతడి భార్య ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం ఈ ఆల్‌రౌండర్‌ తాను కోపాన్ని నియంత్రించుకోవడంలో విఫలమయ్యానంటూ అభిమానులు, టోర్నీ నిర్వహకులకు క్షమాపణలు తెలిపాడు. తనను బీపీఎల్‌ సీఈవోగా నియమిస్తే రెండు నెలల్లో వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేస్తానంటూ ఇటీవల ఈ ఆటగాడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.