కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర టీమ్ విజయం సాధించింది. తొమ్మిది వికెట్ల తేడాతో బంగాల్‌ను ఓడించి రెండోసారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది.
మూడో రోజు ఓవర్‌నైట్ స్కోర్ 169-4తో ఫైనల్ గేమ్‌ను ప్రారంభించిన బంగాల్.. 241 పరుగులకే ఆలౌటయ్యింది. ఇక ఆ జట్టును కాపాడుకునేందుకు కెప్టెన్ మనోజ్ తివారీతో పాటు షాబాజ్ అహ్మద్ రంగంలోకి దిగినప్పటికీ లక్ష్యాన్ని ఛేదించేందుకు విఫలమై నిరాశతో పెవిలియన్ దారి పట్టారు. దీంతో 14 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర 2.4 ఓవర్లలోనే ఛేదించింది.
మొదటి సారి 2019-20లో టైటిల్ విజేతగా సౌరాష్ట్ర నిలిచింది. అప్పుడు కూడా ప్రత్యర్థిగా బంగాల్ టీమ్ కావడం విశేషం. కాగా రంజీల్లో ఇది బంగాల్‌కు 15వ ఫైనల్ కాగా.. 13 సార్లు ఆ జట్టు రన్నరప్‌గానే నిలిచింది. మరోవైపు సౌరాష్ట్ర టీమ్ కెప్టెన్‌గా ఉనద్కత్ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 2019-20లోనూ సౌరాష్ట్రకు సారధ్యం వహించిన ఉనద్కత్.. తొలి రంజీ ట్రోఫీని అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 2022లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలోనూ సౌరాష్ట్ర టీమ్ గెలుపొందింది.