ETV Bharat / sports

వరల్డ్​ కప్​ గెలిచిన స్డేడియంలో సచిన్​ విగ్రహం - సచిన్ విగ్రహం

ముంబయి వాంఖడే స్టేడియంలో సచిన్​ తెందుల్కర్​ నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా తన విగ్రహం కోసం స్థలాన్ని సచినే నిర్ణయించనున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన కెరీర్​ అక్కడే మొదలైందని చెప్పాడు.

sachin tendulkars life size statue
sachin tendulkars life size statue
author img

By

Published : Feb 28, 2023, 12:16 PM IST

Updated : Feb 28, 2023, 2:44 PM IST

ముంబయిలోని వాంఖడే స్టేడియంలో దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ నిలువెత్తు విగ్రాహం ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో తన విగ్రహాన్ని పెట్టే స్థలాన్ని పరిశీలించేందుకు.. మాస్టర్​ బ్లాస్టర్​ భార్య అంజలితో కలిసి మంగళవారం వాంఖడే స్టేడియాన్ని సందర్శించాడు. అనంతరం విగ్రహాం ఏర్పాటు చేసే స్థలంపైన తుది నిర్ణయం తీసుకోనున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సచిన్​ తెందుల్కర్​.. "ప్లెజెంట్​ సర్​ప్రైజ్​.. నా కెరీర్​ ఇక్కడే మొదలైంది. నా కెరీర్ అద్భుతమైన జ్ఞాపకాలతో సాగింది. 2011లో వరల్డ్​ కప్​ ఇక్కడే గెలిచాం. అదే నా కెరీర్​లో బెస్ట్​ మూమెంట్​." అని వివరించాడు. సచిన్ తెందుల్కర్​​తో ముంబయి క్రికెట్​ అసోషియేషన్​ అధ్యక్షుడు అమోల్​ కాలే కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

కాగా, ఏప్రిల్​ 24న సచిన్​ 50వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. దీనికి ఒక్క రోజు ముందు వాంఖడె సచిన్​కు అత్యంత ఇష్టమైన వాంఖడే స్టేడియంలో అతడి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముంబయి క్రికెట్​ అసోషియేషన్​ భావిస్తోంది. దానికి సచిన్​ కూడా అంగీకారం తెలిపారు. ఇది వాంఖడే స్టేడియంలో పెడుతున్న తొలి విగ్రహమని అధికారులు తెలిపారు. ఇది వరేకే ఈ స్టేడియంలో ఓ స్టాండ్​కు సచిన్​ పేరు పెట్టామని నిర్వాహకులు పేర్కొన్నారు.

కాలే మాట్లాడతూ.. "సచిన్​ భారత రత్న అందుకున్న క్రీడాకారుడు. క్రికెట్​కు అతడు అందించిన సేవలు అందరికీ తెలుసు. అతడు ఇప్పుడు 50వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. అందుకే ఉడతా భక్తిగా ఆయన్ను ఇలా గౌరవించాలని అనుకున్నాం. కొన్ని వారాల క్రితం ఇదే మాటను సచిన్​కు చెప్పి, విగ్రహం ఏర్పాటు చేసేలా ఒప్పించాం." అని కాలే వెల్లడించారు.

ఇకపోతే సచిన్​ తెందుల్కర్​ ఇప్పటి వరకు 200 టెస్టులు, 463 వన్డేలు ఆడాడు. ఇక క్రికెట్ చరిత్రలో 100 అంతర్జాతీయ సెంచరీలు పూర్తి చేసిన ఏకైక ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇవే కాకుండా మాస్టర్​ బ్లాస్టర్​ ఎన్నో ఘనతనలను సాధించాడు. అవి ఇప్పటికే ఎవరూ బ్రేక్​ చేయలేదు. అందుకే ఈ లిటిల్​ మాస్టర్​ను అందరూ 'గాడ్ ఆఫ్​ క్రికెట్​ ​' అని అభివర్ణిస్తారు.

ఇవీ చదవండి : టెస్టు క్రికెట్​లో అరుదైన ఘనత.. ఒక్క పరుగు తేడాతో గెలిచిన న్యూజిలాండ్

Last Updated : Feb 28, 2023, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.