ETV Bharat / sports

IND VS SL: సిరీస్​ నుంచి వైదొలిగిన గైక్వాడ్... మయాంక్​కు ఛాన్స్​ - మయాంక్​ అగర్వాల్​

IND Vs SL Ruturaj Gaikwad injury: గాయం కారణంగా లంకతో తొలి టీ20కు దూరమైన ఓపెనర్​ రుతురాజ్​ గైక్వాడ్.. ఇప్పుడు పూర్తిగా​ సిరీస్​కు దూరమయ్యాడు. అతడి స్థానంలో మయాంక్​ అగర్వాల్​ జట్టులోకి రానున్నాడు.

author img

By

Published : Feb 26, 2022, 10:15 AM IST

IND Vs SL Ruturaj Gaikwad injury: టీమ్​ఇండియాను గాయల బెడద వెంటాడుతోంది. శ్రీలంకతో జరుగుతోన్న సిరీస్​లో భాగంగా రెండో టీ20కు కీలక ఆటగాడు దూరం కానున్నాడు. ఇప్పటికే మణికట్టుకు గాయం అవ్వడం వల్ల మెదటి మ్యాచ్​కు దూరమైన రుతురాజ్​ గైక్వాడ్​.. గాయం తీవ్రతరం కావడం వల్ల ఇప్పుడు పూర్తిగా సిరీస్​ నుంచి వైదొలిగాడు. మిగిలిన మ్యాచ్​లకు అందుబాటులో ఉండట్లేదు. అతడి స్థానంలో మరో ఓపెనర్​ మయాంక్ అగర్వాల్​ను ఎంపిక చేశారు.

ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు ఈ టీ20 సిరీస్​కు దూరమయ్యారు. కాగా, లంకతో జరిగిన తొలి టీ20లో భారత్​ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. శనివారం ధర్మశాలలో రెండో టీ20 ఆడనుంది.

ఇదీ చదవండి:టీమ్​ఇండియా జోరు.. ఈ మ్యాచ్​ గెలిస్తే సిరీస్​ మనదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.