ETV Bharat / sports

దిల్లీ ప్లేయర్​కు కరోనా.. టోర్నీ మధ్యలో వెస్టిండీస్​కు హెట్మెయర్​ - దిల్లీ ప్లేయర్​కు కరోనా

ఐపీఎల్​లో మళ్లీ కరోనా కలకలం రేపింది. నేడు(ఆదివారం) సీఎస్కేతో మ్యాచ్​ జరగనున్న నేపథ్యంలో చేసిన టెస్టుల్లో ఓ దిల్లీ ఆటగాడికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. మరోవైపు, రాజస్థాన్​ కీలక ప్లేయర్​ కీలక ఆటగాడు హెట్మెయర్​ ఐపీఎల్​ మధ్యలోనే వీడి స్వదేశానికి వెళ్లనున్నాడు.

Shimron Hetmyer
షిమ్రాన్ హెట్మెయర్
author img

By

Published : May 8, 2022, 1:47 PM IST

Delhi net bowler corona: దిల్లీ క్యాపిటల్స్ జట్టులో మళ్లీ కరోనా కలకలం రేపింది. ఆ టీమ్​లోని ఓ నెట్​ బౌలర్​కు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. చెన్నైతో నేడు(ఆదివారం) మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేశారు. ఈ టెస్టుల్లోనే ఓ ఆటగాడికి వైరస్​ ఉన్నట్లు నిర్ధరణ అయింది. మరికొద్దిగంటల్లో మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆటగాడు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. "ఈ రోజు ఉదయం చేసిన టెస్టుల్లో ఓ నెట్​ బౌలర్​కు పాజిటివ్​గా తేలింది. ఆటగాళ్లను రూమ్స్​లోనే ఐసోలేషన్​లో ఉండాలని సూచించాం" అని ఓ ఐపీఎల్​ ప్రతినిధి తెలిపారు. ​

ఐపీఎల్​ ప్రొటోకాల్​ ప్రకారం ఆటగాళ్లకు మరోసారి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా ప్లేయర్స్​ను ఐసోలేషన్​లో ఉంచాలా లేదా సహా మ్యాచ్ జరిగే​ విషయంపై నిర్ణయం తీసుకుంటారు.

Rajasthan royals Shimron Hetmyer: రాజస్థాన్​ రాయల్స్​ కీలక ఆటగాడు హెట్మెయర్​ ఐపీఎల్​ మధ్యలోనే వీడి స్వదేశానికి వెళ్లనున్నాడు. అతడి భార్య బిడ్డకు జన్మనివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని టీమ్​ మేనేజ్​మెంట్​ ట్వీట్​ చేసింది. వచ్చే వారం జట్టుతో కలుస్తాడని తెలిపింది. దీంతో ఈ మధ్యలో కనీసం 2 మ్యాచ్​లకు అతను దూరం కానున్నాడు. "జీవితంలో పిల్లలు పుట్టే మధురక్షణం ఒక్కసారే వస్తుంది. నా బిడ్డను చూడాలనే తాపత్రయంతో స్వదేశానికి వెళ్తున్నా. తొందరలోనే మళ్లీ కలుస్తా" అంటూ హెట్మెయర్​ ​తెలిపాడు. కాగా, రాజస్థాన్​ జట్టు.. ప్రస్తుతం ప్లేఆఫ్స్​కు చేరువగా ఉంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఇదీ చూడండి: అందుకే నేను కెప్టెన్‌ అవ్వలేకపోయా: స్పష్టతనిచ్చిన యువీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.