ETV Bharat / sports

రోహిత్ శర్మ ఫామ్​.. రెండు నెలల్లో 500 ప్లస్​ - రోహిత్ శర్మ 2023 వన్డే రన్స్​

ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన సిరీస్​లో టీమ్​ఇండియా మంచి ప్రదర్శన చేసింది. అలాగే ఈ సిరీస్​లన్నింటినలోనూ కెప్టెన్ రోహిత్​ శర్మ కూడా బాగానే ఆడాడు. ఓ సారి అతడి ప్రదర్శనపై లుక్కేద్దాం..

Rohithsharma 2023 stats
రోహిత్ శర్మ ఫామ్​.. రెండు నెలలు.. 8 మ్యాచులు.. 500 ప్లస్​
author img

By

Published : Feb 28, 2023, 7:18 PM IST

టీమ్​ఇండియా ప్రస్తుతం మంచి జోష్​లో పరిగెడుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు.. ఎందులోనూ ఓడిపోలేదు. ఇప్పుడు బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే ఈ సిరీస్​లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. 2-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు ఆడిన సిరీస్‌లన్నింటిలోనూ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మంచి ప్రదర్శన చేశాడు. మంచి స్ట్రైక్​ రేట్​తోనే ఆడుతున్నాడు. మొత్తం రెండు సెంచరీలు బాదాడు.

అతడి గణాంకాల విషయానికొస్తే.. ఈ ఏడాది అతడు ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లోని 9 ఇన్నింగ్స్ ఆడిన హిట్​ మ్యాన్​ 56.77 సగటుతో మొత్తం 511 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.

అలాగే ఈ ఏడాది టీమ్ ఇండియా తరఫున అత్యధికంగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో యంగ్​ బ్యాటర్​ శుభ్‌మన్ గిల్ 769 రన్స్​తో నంబర్ వన్‌గా నిలిచాడు.

ఈ ఏడాది టెస్టుల్లో ఇప్పటివరకు అతడు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లోని మూడు ఇన్నింగ్స్‌ల్లో 61 సగటుతో 183 రన్స్​ చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది.

ఇక ఆరు వన్డే మ్యాచులాడి 54.66 సగటు, 105.80 స్ట్రైక్​ రేట్​తో 328 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు.

మొత్తంగా రోహిత్ శర్మ ఇప్పటి వరకు టీమ్​ఇండియా తరుపున మొత్తం 47 టెస్టులు, 241 వన్డేలు, 148 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 47.76 సగటుతో 3320 పరుగులు చేయగా.. వన్డేలలో 48.91 సగటుతో 9,782 రన్స్​, టీ20ల్లో 31.32 సగటు, 139.24 స్ట్రైక్ రేట్‌తో 3853 రన్స్ సాధించాడు.

ఇక ప్రస్తుతం టీమ్​ఇండియా బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్​ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే వరుసగా రెండు టెస్టుల్లో గెలిచిన భారత్‌.. మూడో మ్యాచ్​లోనూ ఆసీస్​ను ఓడించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మార్చి 1 నుంచి ఇండోర్‌ వేదికగా మూడో టెస్టు మొదలు కానుంది.

ఇదీ చూడండి: కేఎల్​ రాహుల్​ వైస్ కెప్టెన్సీ తొలగింపు.. ఎట్టకేలకు స్పందించిన రోహిత్‌ శర్మ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.