ETV Bharat / sports

కోహ్లీ నాయకత్వంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను: రోహిత్ - rohit sharma vs virat kohli

Rohit Sharma on Virat Kohli: విరాట్ కోహ్లీ నేతృత్వంలో గొప్ప అనుభూతి పొందినట్లు చెప్పాడు టీమ్​ఇండియా ప్రస్తుత వైట్​బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఐదేళ్ల పాటు జట్టును కోహ్లీ ముందుడి నడిపించాడని కొనియాడాడు.

Rohit Sharma on Virat Kohli
rohit on virat
author img

By

Published : Dec 13, 2021, 3:38 PM IST

Rohit Sharma on Virat Kohli: టీమ్​ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్​గా జట్టును విరాట్​ కోహ్లీ ముందుండి నడిపించాడని అన్నాడు ప్రస్తుత వైట్​బాల్ సారథి రోహిత్ శర్మ. కోహ్లీ నేతృత్వంలో ఆడిన ప్రతిక్షణాన్ని ఆస్వాదించినట్లు చెప్పాడు.

Rohit Sharma on Virat Kohli
విరాట్- రోహిత్

"ఐదేళ్లు జట్టుకు విరాట్ నాయకత్వం వహించాడు. బరిలో దిగిన ప్రతిసారీ ముందుండి నడిపించాడు. ప్రతి గేమ్​ను​ గెలవాలనే పట్టుదల, స్ఫూర్తిని అందరిలో నింపేవాడు. అతడి సారథ్యంలో ఆడిన ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను. ఇకపైనా ఆస్వాదిస్తాను."

-రోహిత్ శర్మ, టీమ్​ఇండియా కెప్టెన్

టీ20 ప్రపంచకప్​ ముగింపుతో టీ20 కెప్టెన్​గా కోహ్లీ తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలను రోహిత్ అందుకున్నాడు. ఇటీవలే వన్డే సారథిగానూ రోహిత్​నే ఎంపిక చేసింది బీసీసీఐ.

2013 నుంచి టీమ్​ఇండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోవడంపై రోహిత్ స్పందించాడు. "తుది ఫలితాన్ని గురించి ఆలోచించడానికి ముందు చాలా విషయాలను సరైన పద్ధతిలో చేయాలి. 2013లో చివరి సారి ఐసీసీ ట్రోఫీ (ఛాంపియన్స్​ ట్రోఫీ) సాధించాం. అప్పటి నుంచి మేము చేసిన తప్పు కూడా ఏమీ లేదు. బాగా ఆడినా.. ఫలితం దక్కలేదు." అని రోహిత్ చెప్పాడు.

ఇదీ చూడండి: కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా మాట్లాడిన రోహిత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.