ETV Bharat / sports

'భారత్​- పాక్​, ఆ రెండు జట్లతో టీ20 సిరీస్​.. ఐసీసీకి ప్రతిపాదిస్తా' - రమీజ్​ రాజా తాజా వార్తలు

India VS Pakistan: భారత్-పాకిస్థాన్ సిరీస్​ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై ఆసక్తికర ట్వీట్ చేశాడు పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా. భారత్​, పాక్​ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ జట్లు కూడా ఈ సూపర్​ సిరీస్​లో ఆడేలా ఐసీసీకి ప్రతిపాదిస్తానని అన్నాడు.

Ramiz Raja
రమీజ్​ రాజా
author img

By

Published : Jan 12, 2022, 11:26 AM IST

Updated : Jan 12, 2022, 11:54 AM IST

Ramiz Raja On India VS Pakistan: ఎప్పుడో 2012లో భారత్​- పాకిస్థాన్ మధ్య చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్​ జరిగింది. అప్పటినుంచి ఇరు దేశాల మధ్య సిరీస్​లు నిర్వహించాలని భావించినా.. భద్రతా పరిస్థితుల దృష్ట్యా అది కుదరడం లేదు.

ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్​ రమీజ్​​ రాజా ఆసక్తికర ట్వీట్​ చేశాడు. భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగకపోయినా, నాలుగు దేశాల మధ్య టీ20 సూపర్ సిరీస్ నిర్వహించాలని తాను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ప్రతిపాదిస్తానని అన్నాడు. ఈ సిరీస్​లో భారత్​, పాక్​తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ జట్లు కూడా పాల్గొంటాయని తెలిపాడు. ఈ మేరకు రమీజ్​​ రాజా ట్వీట్​ చేశాడు.

"హలో, ఫ్యాన్స్​. నాలుగు దేశాల మధ్య టీ20 సూపర్​ సిరీస్ నిర్వహించాలని ఐసీసీకి సిఫార్సు చేస్తాను. ఈ సిరీస్ ఏటా నిర్వహించాలి. ఒక్కో సంవత్సరం ఒక్కో దేశం ఆతిథ్యం ఇస్తుంది. తద్వారా ఈ సిరీస్​పై వచ్చిన లాభాలను పర్సెంటేజ్ పద్ధతిలో ఐసీసీ సభ్యులందరికీ వాటా ఇస్తుంది" అని తన ట్వీట్​లో పేర్కొన్నాడు రమీజ్​​ రాజా.

గతేడాది యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్​కప్​లో గ్రూప్ స్టేజీలో భారత్​- పాకిస్థాన్​ తలపడ్డాయి. బాబర్​ అజామ్ సారథ్యంలో పాక్​ జట్ట.. భారత్​పై 10 వికెట్ల తేడాతో చారిత్రక విజయం నమోదు చేసింది. అయితే పాకిస్థాన్​ జట్టు గ్రూప్ స్టేజ్​లో అదరగొట్టినా.. సెమీఫైనలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.

ఇదీ చూడండి: IND Vs SA: 'కోహ్లీ బ్యాటింగ్ తీరు​పై ఆందోళనే లేదు'

Last Updated : Jan 12, 2022, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.