ETV Bharat / sports

పంజాబ్​ కింగ్స్ కొత్త​ కెప్టెన్​గా మయాంక్​.. అధికార ప్రకటన - ipl auction

Punjab kings Captain Mayank Agarwal: భారత బ్యాటర్​ మయాంక్ అగర్వాల్​ను ​కెప్టెన్​గా నియమించింది పంజాబ్​ కింగ్స్​.​ సోషల్​మీడియా ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

punjab captain mayank agarwa
ppunjab captain mayank agarwal
author img

By

Published : Feb 28, 2022, 11:39 AM IST

Updated : Feb 28, 2022, 12:20 PM IST

Punjab kings Captain Mayank Agarwal: పంజాబ్​ కింగ్స్​ కొత్త కెప్టెన్​ అధికార ప్రకటన వచ్చేసింది. మయాంక్​ అగర్వాల్​ను సారథిగా నియమించినట్లు ఫ్రాంఛైజీ తెలిపింది. సోషల్​మీడియాలో ఈ విషయాన్ని ట్వీట్​ చేసింది. వేలంకు ముందే మయాంక్​(రూ.12కోట్లు), పేసర్​ హర్షదీప్​సింగ్​ను(రూ.4కోట్లు) పంజాబ్​ రిటెయిన్ చేసుకుంది.​ కాగా, తనను సారథిగా ఎంపిక చేసినందుకు హర్షం వ్యక్తం చేశాడు మయాంక్​.

"నాపై పంజాబ్ యాజమాన్యం నమ్మకం ఉంచి జట్టు పగ్గాలు అప్పజెప్పినందుకు ధన్యవాదాలు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేందుకు నా శాయశక్తులా కృషి చేస్తా. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో ఈ సీజన్​లో పంజాబ్ జట్టు మరింత బలంగా తయారైంది."

- పంజాబ్​ కెప్టెన్ మయాంక్ అగర్వాల్

మయాంక్ 2018వ సంవత్సరం నుంచి పంజాబ్​ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ​ గత కొన్ని సంవత్సరాలుగా మయాంక్​ అగర్వాల్​, కెఎల్​ రాహుల్(పంజాప్​ పాత కెప్టెన్​)​ జోడీ ఐపీఎల్​లో అద్భుత ప్రదర్శన చేసింది. గత సీజన్​ తర్వాత జట్టుకు నుంచి బయటకు వచ్చిన రాహుల్​ ప్రస్తుతం కొత్త జట్టు లక్నో సూపర్​జెయింట్​ జట్టుకు కెప్టెన్​గా ఎంపికయ్యాడు. గతేడాది రాహుల్​కు గాయమైన సమయంలో మయాంక్​కు​ కెప్టెన్​గా బాధ్యతలు స్వీకరించిన అనుభవం కూడా ఉంది. గత రెండు సీజన్లలో 400కు పైగా పరుగులు సాధించాడు. 2011లో ఐపీఎల్​లో అడుగుపెట్టిన అతడు 100కు పైగా మ్యాచులు ఆడగా..భారత్​ తరఫున 19 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు.

శిఖర్​ ధావన్​, జానీ బెయిర్​స్టో, లియామ్​ లింవింగ్​స్టోన్​, కగిసో రబడ, హర్​ప్రీత్​ బ్రార్​, సందీప్ శర్మ, రాహుల్ చహార్, తమిళనాడు సంచలనం షారుక్​ ఖాన్​ సహా పలువురు ఆటగాళ్లను పంజాబ్ జట్టు ఈ సారి మెగా వేలంలో దక్కించుకుంది.

ఇదీ చదవండి: లంకను క్లీన్​స్వీప్​ చేసిన టీమ్​ ఇండియా.. రోహిత్​ సేన రికార్డు

Last Updated : Feb 28, 2022, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.