Pak Vs SL Asia Cup 2023 : ఆసియా కప్‌లో సూపర్-4లో భాగంగా జరిగిన ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌ను డీఎల్‌ఎస్ ప్రకారం 2 వికెట్ల తేడాతో శ్రీలంక ఓడించి ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో శ్రీలంక చివరి బంతికి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు చేసిన పాక్ 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.
9 పరుగులకే ఫఖర్ జమాన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన పాక్ జట్టు... ఆ తర్వాత నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నెట్టుకొచ్చింది. ఈ క్రమంలో బాబార్ అజామ్(29)తో కలిసి షఫిక్(52) మంచి ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే నెమ్మదిగా ఆడిన ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక రిజ్వాన్ 86, షఫిక్ 52 పరుగులతో అర్ధశతకాలు చేయగా..ఇఫ్తికర్ అహ్మద్ 47 పరుగులతో రాణించాడు.
మరోవైపు లక్ష్య చేధనలో లంక 42 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కుశాల్ మెండిస్ 91, సమరవిక్రమ 48, అసలంక 49 పరుగులతో శ్రీలంకను విజయతీరాలకు చేర్చారు. బౌలర్లలో పతిరణ 3, ప్రమోద మదుశన్ రెండు వికెట్లు తీశారు. పాక్ బౌలర్లలో ఇఫ్తికర్ 3, షాహీన్ ఆఫ్రిది రెండు వికెట్లు పడగొట్టారు.ఆదివారం శ్రీలంక, భారత్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది.
పాకిస్థాన్ ఇన్నింగ్స్: షఫిక్ (సి) మదుశాన్ (బి) పతిరన 52; ఫకర్ జమాన్ (బి) మదుశాన్ 4; బాబర్ అజామ్ (స్టంప్డ్) మెండిస్ (బి) వెల్లలాగె 29; రిజ్వాన్ నాటౌట్ 86; హారిస్ (సి) అండ్ (బి) పతరన 3; నవాజ్ (బి) తీక్షణ 12; ఇఫ్తికార్ (సి) శానక (బి) పతిరన 47; షాదాబ్ (సి) మెండిస్ (బి) మదుశాన్ 3; షహీన్ అఫ్రిది నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (42 ఓవర్లలో 7 వికెట్లకు) 252 వికెట్ల పతనం: 1-9, 2-73, 3-100, 4-108, 5-130, 6-238, 7-243
బౌలింగ్: ప్రమోద్ మదుశాన్ 7-1-58-2; తీక్షణ 9-0-42-1; దసున్ శానక 3-0-18-0; వెల్లలాగె 9-0-40-1; పతిరన 8-0-65-3; ధనంజయ డిసిల్వా 6-0-28-0
శ్రీలంక ఇన్నింగ్స్:
నిశాంక (సి) అండ్ (బి) షాదాబ్ 29; కుశాల్ పెరీరా రనౌట్ 17; కుశాల్ మెండిస్ (సి) హారిస్ (బి) ఇఫ్తికార్ 91; సమరవిక్రమ (స్టంప్డ్) రిజ్వాన్ (బి) ఇఫ్తికార్ 48; అసలంక నాటౌట్ 49; శానక (సి) నవాజ్ (బి) ఇఫ్తికార్ 2; ధనంజయ డిసిల్వా (సి) వసీమ్ (బి) షహీన్ 5; వెల్లలాగె (సి) రిజ్వాన్ (బి) షహీన్ 0; మదుశాన్ రనౌట్ 1; పతిరన 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (42 ఓవర్లలో 8 వికెట్లకు) 252 వికెట్ల పతనం: 1-20, 2-77, 3-177, 4-210, 5-222, 6-243, 7-243, 8-246;
బౌలింగ్: షహీన్ అఫ్రిది 9-0-52-2; జమాన్ ఖాన్ 6-1-39-0; వసీమ్ 3-0-25-0; నవాజ్ 7-0-26-0; షాదాబ్ 9-0-55-1; ఇఫ్తికార్ 8-0-50-3
-
What a thrilling victory!
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Sri Lanka secures a spot in the #AsiaCup2023 finals on Sunday with a thrilling 2-wicket win over Pakistan!#AsiaCup2023 #SLvPAK pic.twitter.com/lJF3CCNjPK
">What a thrilling victory!
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 14, 2023
Sri Lanka secures a spot in the #AsiaCup2023 finals on Sunday with a thrilling 2-wicket win over Pakistan!#AsiaCup2023 #SLvPAK pic.twitter.com/lJF3CCNjPKWhat a thrilling victory!
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 14, 2023
Sri Lanka secures a spot in the #AsiaCup2023 finals on Sunday with a thrilling 2-wicket win over Pakistan!#AsiaCup2023 #SLvPAK pic.twitter.com/lJF3CCNjPK
Dunith Wellalage Asia Cup 2023 : భారత్‌ను హడలెత్తించిన కుర్ర స్పిన్నర్.. అసలెవరీ దునిత్ ?