మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్(sachin retirement day) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి సోమవారానికి(నవంబరు 16) ఎనిమిదేళ్లు పూర్తయింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన 200వ టెస్టు తర్వాత అన్ని ఫార్మాట్లకు సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో మాస్టర్ 74 పరుగులు చేసి ఔటయ్యాడు.
తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేయనుందుకు సచిన్ చాలా బాధపడ్డాడు(sachin retirement speech). ఈ క్రమంలోనే చేసిన అతడి ప్రసంగం క్రికెట్ అభిమానుల మదిలో ఎప్పటికీ అలానే నిలిచిపోతుంది.
"సమయం చాలా త్వరగా గడిచింది. కానీ, మీరు నాకు ఇచ్చిన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి. ముఖ్యంగా 'సచిన్ సచిన్' అని మీరు అరిచే అరుపులు నా శ్వాస ఆగేవరకు చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి" అని సచిన్ భావోద్వేగంతో చెప్పాడు.
అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్
గతేడాది ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరిన ఆరో భారతీయుడిగా సచిన్ ఘనత సాధించాడు(sachin tendulkar icc hall of fame). 1989లో 16 ఏళ్లప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మాస్టర్.. మొత్తంగా ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా (34,357 పరుగులు) రికార్డు నమోదు చేశాడు. తర్వాతి స్థానంలో ఉన్న శ్రీలంక బ్యాట్స్‌మన్ కుమార్ సంగక్కర్.. సచిన్ కంటే 6000 పరుగుల అంతరంతో ఉన్నాడు.
ఐపీఎల్లో మెంటర్‌గా
సచిన్(sachin international records).. వన్డేల్లో 18,426, టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. 2011లో ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. వన్డేలకు 2012లోనే రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్.. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ జట్టుకు మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇదీచూడండి: 'పంత్‌కు భయమంటే తెలియదు.. అతడిలా ఆడతా'