ETV Bharat / sports

ODI World Cup 2023 : 'జట్టులో అతడిపైనే భారీ ఆశలు.. అలా ఆడితే విజయం పక్కా' - ODI World Cup 2023 schedule

ODI World Cup 2023 Lalchand Rajput : భారత్​ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్​ 2023లో టీమ్​ఇండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని టీమ్​ ఇండియా మాజీ ప్లేయర్​, క్రికెట్ మేనేజర్ లాల్ చంద్​ రాజ్​పుత్​ ధీమా వ్యక్తం చేశారు. యంగ్ ప్లేయర్​ గిల్​పై భారీ అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ODI World Cup 2023 : 'జట్టులో అతడిపైనే భారీ ఆశలు.. అలా ఆడితే విజయం పక్కా'

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2023, 10:49 PM IST

ODI World Cup 2023 Lalchand Rajput : భారత్​ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్​ 2023లో టీమ్​ఇండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని టీమ్​ ఇండియా మాజీ ప్లేయర్​, క్రికెట్ మేనేజర్ లాల్ చంద్​ రాజ్​పుత్​ ధీమా వ్యక్తం చేశారు. యంగ్ ప్లేయర్​ గిల్​పై భారీ అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు.

కప్​ మనదే.. ఎనిమిదో స్థానంలో అతడైతే ఒకే.. 'ముగ్గురు పేసర్లతో టీమ్​ ఇండియా బరిలోకి దిగితే.. వారిలో షమి, సిరాజ్​, బుమ్రా ఉంటే బాగుంటుంది. అయితే ఎనిమిదో స్థానం కోసం టీమ్ మేనేజ్​మెంట్​ బ్యాటింగ్​ కూడా చేయగలిగే బౌలర్​​ ఉండాలని భావిస్తోంది. ఇప్పటికే హార్దిక్ పాండ్య, జడేజా లాంటి వారు ఏడో స్థానంలో ఉన్నారు. అదే కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగితే.. అప్పుడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​ ఎనిమిదో స్థానంలో ఆడొచ్చు. ఆసియా కప్​ ఫైనల్​ టీమ్​ఇండియా అద్భుతంగా ఆడిన విధానం చూస్తుంటే కచ్చితంగా వచ్చే వరల్డ్ కప్​లో గెలుస్తుందని అనిపిస్తుంది. జట్టు మంచి వరల్డకప్​ కోసం మంచి ఆకలి మీద ఉన్నట్లు అర్థమవుతోంది.' అని లాల్​ చంద్ అన్నారు.

గిల్​పై భారీగా.. 'జట్టులో కొంతమంది ఆటగాళ్లపై మంచి అంచనాలు ఉన్నాయని అన్నారు లాల్​ చంద్​ రాజ్​పుత్​. గిల్​ సూపర్ ఫామ్​లో ఉన్నాడు. కోహ్లీ, కేఎల్ రాహుల్​ ఆసియా కప్​లో అద్భుత సెంచరీలు బాదారు. కెప్టెన్ రోహిత్ కూడా మంచి ఫామ్​లో ఉన్నాడు. అయ్యర్​ కూడా మంచి రాణించాడు. కానీ వీరందరిలోకల్లా నాకు గిల్​పైనే భారీ అంచనాలు ఉన్నాయి' అని పేర్కొన్నారు.

జడేజాపై ఆందోళన లేదు.. 'వన్డేల్లో జడేజా ఫామ్​ గురించి నాకు ఎటువంటి ఆందోళన లేదు. అతడు మ్యాచ్ విన్నర్​. బౌలింగ్ ఆల్​ రౌండర్​. బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు. గన్​ ఫీల్డర్​ కూడా. ఈ మధ్య కాలంలో అతడు బ్యాట్​తో సరిగ్గా రాణించలేకపోవచ్చు. కానీ అతడు కచ్చితంగా ఫామ్​లోకి వచ్చేస్తాడు' అని అన్నారు.

ఇలా ఆడితేనే గెలుపు.. 'నాక్ ఔట్ గేమ్స్​లో వీలైనంత అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. అలా అని సెమీఫైనల్​, ఫైనల్​ గేమ్​ అనే రేంజ్​లో ఒత్తిడి తీసుకునేలా కాదు. కేవలం ఆడే మ్యాచ్​పై మాత్రమే బాగా ఫోకస్ చేయాలి. లేదంటే ఒత్తిడి పడితే జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది' అని లాల్​ చెప్పారు.

ODI World Cup 2023 : 'టీమ్​ఇండియాకు ఆ సత్తా ఉంది.. అతడు అద్భుతం చేస్తాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.