Teamindia Australia Gavaskar trophy: క్రికెట్‌లో ప్రతి ఏడాది వివిధ దేశాల మధ్య ఎన్నో ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతుంటాయి. అయితే, అన్ని సిరీస్‌లు అందరికీ గుర్తుండవ్. కానీ, కొన్ని సిరీస్‌లను మాత్రం ఎప్పటికీ మార్చిపోలేం. అలాంటి చరిత్రాత్మక సిరీసే 2020-21లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్-ఆసీస్ మధ్య జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ. ఈ సిరీస్‌ని టీమ్‌ఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
ఈ చరిత్రాత్మక సిరీస్‌ను బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే డాక్యుమెంటరీ రూపంలో చూపించాలనుకుంటున్నాడు. డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ను టీమ్‌ఇండియా క్రికెటర్లు అజింక్యా రహానే, మహ్మద్ సిరాజ్, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, ఛెతేశ్వర్ పుజారా విడుదల చేశారు. ఈ డాక్యుమెంటరీని నీరజ్ పాండే 'బంధన్ మే తా ధమ్' పేరుతో నిర్మించాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో జరిగిన సంఘటనలను అంశాలుగా తీసుకొచ్చి.. మధ్యమధ్యలో రహానే,సిరాజ్‌లు తమ అనుభవాలను పంచుకునేలా ట్రైలర్‌ను రూపొందించారు. జూన్ 16 నుంచి ఓటీటీ ఫ్లాట్‌ప్లామ్ అయిన వూట్ సెలెక్ట్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
-
When everything was against them, they stood tall and showed the world their true grit, strength and determination.
— Voot Select (@VootSelect) June 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Witness the story of the greatest fightback. The story behind India’s biggest triumph in Test history.#BandonMeinThaDum - The fight for India’s pride. pic.twitter.com/T6ilpxIbgH
">When everything was against them, they stood tall and showed the world their true grit, strength and determination.
— Voot Select (@VootSelect) June 1, 2022
Witness the story of the greatest fightback. The story behind India’s biggest triumph in Test history.#BandonMeinThaDum - The fight for India’s pride. pic.twitter.com/T6ilpxIbgHWhen everything was against them, they stood tall and showed the world their true grit, strength and determination.
— Voot Select (@VootSelect) June 1, 2022
Witness the story of the greatest fightback. The story behind India’s biggest triumph in Test history.#BandonMeinThaDum - The fight for India’s pride. pic.twitter.com/T6ilpxIbgH
ఇదీ చూడండి: ఆ ఊహాగానాలపై దాదా క్లారిటీ.. ఇంతకీ ఏమన్నాడంటే?