ETV Bharat / sports

ధోనీ రూ.100 కోట్ల పరువు నష్టం దావా- విచారణ వాయిదా - ఎంఎస్​ ధోనీ పరువు నష్టం కేసు

టీమ్ఇండియా మాజీ సారథి ధోనీ వేసిన పరువు నష్టం కేసును మరో రెండు వారాల పాటు వాయిదా వేసింది మద్రాస్ హైకోర్టు. కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్​.శేషాయ్​.. వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లకుండా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని పేర్కొన్నాడు.

MS Dhoni
ఎంఎస్ ధోనీ
author img

By

Published : Aug 25, 2021, 10:11 AM IST

ప్రైవేట్​ టీవీ ఛానల్​తో పాటు ఐపీఎస్​ అధికారి సంపత్​ కుమార్​పై.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్​ ధోనీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును రెండు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఎన్​.శేషాయ్ నిర్ణయం తీసుకున్నారు. కేసులో వాదప్రతివాదనలు విన్న న్యాయమూర్తి వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లకుండా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని పేర్కొన్నాడు.

అసలేం జరిగింది..

ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్ జట్టు రాజస్థాన్​ రాయల్స్​తో కలిసి ఫిక్సింగ్​కు పాల్పడినట్లు ఓ ప్రైవేట్​ టీవీ ఛానల్​ ఆరోపించింది. మధ్యవర్తిగా ఉన్న కిట్టీ అనే వ్యక్తి ఇందులో ధోనీ పాత్ర ఉన్నట్లు ఒప్పుకున్నాడని సదరు ఛానల్ పేర్కొంది. ఇదే విషయాన్ని కేసు విచారణ చేసిన ఐపీఎస్ అధికారి సంపత్​ కుమార్ కూడా ధ్రువీకరించారు.

దీనిపై స్పందించిన ధోనీ ఏకంగా కోర్టు మెట్లెక్కారు. తన పరువుకు భంగం వాటిల్లేలా టీవీ ఛానల్​తో పాటు ఐపీఎస్​ అధికారి ప్రవర్తించారని.. మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావాను దాఖలు చేశాడు. ఈ కేసు 2014కి సంబంధించింది.

ఈ కేసులో సీబీసీఐడీ తన దర్యాప్తు కొనసాగిస్తుంది. ధోనీని ఈ కేసు నుంచి కాపాడటానికి కిట్టీ నిజం ఒప్పుకోవట్లేదని సదరు టీవీ ఛానల్​ చెప్పుకొచ్చింది. మహి క్రికెట్ కంటే గొప్పవాడు కాదని పేర్కొంది. ఆటలో ఫిక్సింగ్ అనేది సాధారణమైపోయిందని ఇటీవల సుప్రీం చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసింది. ధోనీతో తమకు వ్యక్తిగత ద్వేషం లేదని స్పష్టం చేసింది. ఐపీఎల్ ఫిక్సింగ్​ను బయటపెట్టడానికే మేము ఈ అంశాన్ని తీసుకున్నామని టీవీ ఛానల్​ పేర్కొంది. మీడియా గొంతు నొక్కడానికి ధోనీ ప్రయత్నిస్తున్నట్లయితే అతడి కేసును జరిమానాతో కొట్టివేయాలని అభిప్రాయపడింది. ​

ఇదీ చదవండి: ms dhoni: సిక్సులు బాదాడు.. బంతి కోసం వెతికాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.