ETV Bharat / sports

స్టార్క్​పై కాసుల వర్షం- ఐపీఎల్ రికార్డులన్నీ బద్దలు- రూ. 24.75 కోట్లకు KKR కైవసం

Mitchell Starc Ipl 2024 Auction : 2024 ఐపీఎల్​ వేలంలో రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆల్​టైమ్ రికార్డు ధరకు అమ్మడయ్యాడు.

mitchell starc ipl 2024 auction
mitchell starc ipl 2024 auction
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 4:07 PM IST

Updated : Dec 19, 2023, 5:21 PM IST

Mitchell Starc Ipl 2024 Auction : 2024 ఐపీఎల్​ వేలంలో గత రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఆస్ట్రేలియా పేస్​గన్ మిచెల్ స్టార్క్ కనీవిని ఎరుగని రీతిలో ఆల్​టైమ్​ ప్రైజ్​ దక్కించుకున్నాడు. అతడ్ని వేలంలో కోల్​కతా నైట్​రైడర్స్ జట్టు రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. స్కార్క్​ కోసం బిడ్డింగ్​లో గుజరాత్ టైటాన్స్ - కోల్​కతా నైట్​రైడర్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రెండు ఫ్రాంచైజీలు తగ్గేదేలే అన్నట్లు స్టార్క్​ కోసం ప్రయత్నించాయి. చివరికి కోల్​కతా అతడ్ని సొంతం చేసుకుంది.

Sunrisers Hyderabad Pat Cummins : ఇదే వేలంలో ఆసీస్​ కెప్టెన్ ప్యాట్ కమిన్స్​ను రూ. 20.50 కోట్లకు సన్​రైజర్స్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల బేస్​ ప్రైజ్​ వద్ద ప్రారంభమైన బిడ్డింగ్​లో సన్​రైజర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కమిన్స్​ను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. చివరికి ఈ బిడ్డింగ్ నుంచి బెంగళూర్ డ్రాప్ అవ్వండం వల్ల కమిన్స్​ను హైదరాబాద్​ సొతం చేసుకుంది. దీంతో ఇప్పటివరకు ఐపీఎల్​ హిస్టరీలోనే అత్యధిక ధరకి కొనుగోలైన ఆటగాళ్లుగా స్టార్క్, కమిన్స్​ నిలిచారు. కాగా, వీరిద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లే కావడం విశేషం.

Daryl Mitchell 2024 IPL Price : న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ కూడా తొలిసారి వేలంలోనే భారీ ధరకు అమ్ముడయ్యాడు. అతడ్ని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్లకు దక్కించుకుంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్​కప్​లో మిచెల్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. అతడు 9 ఇన్నింగ్స్​ల్లో 60 సగటుతో 552 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.

ఐపీఎల్​లో టాప్ - 5 భారీ కొనుగోళ్లు

  • మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)- రూ. 24.75 కోట్లు- కోల్​కతా నైట్​రైడర్​ (2024)
  • ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)- రూ. 20.50 కోట్లు- సన్​రైజర్స్ హైదరాబాద్ (2024)
  • శామ్ కరన్ (ఇంగ్లాండ్) - రూ. 18.50 కోట్లు- పంజాబ్ కింగ్స్ (2023)
  • కామెరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా)- రూ. 17.50 కోట్లు- ముంబయి ఇండియన్స్ (2023)
  • బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) - రూ. 16.25 కోట్లు- చెన్నై సూపర్​కింగ్స్ (2023).

ఆల్​టైమ్ రికార్డ్ ప్రైజ్ వరల్డ్​కప్ విన్నింగ్​ కెప్టెన్​ రాకతో Srhలో నయా జోష్

ఐపీఎల్ రికార్డ్ బద్దలు- కమిన్స్​ను దాటిన స్టార్క్- రూ. 24.75 కోట్లకు KKR కొనుగోలు

Last Updated : Dec 19, 2023, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.