లాక్డౌన్ సమయంలో ఆన్‌లైన్ క్లాస్‌లు గురించి విన్నాం. కానీ అంతర్జాతీయ క్రికెట్లో ఆన్‌లైన్ కోచ్ గురించి ఎప్పుడైనా విన్నారా? క్రికెట్ చరిత్రలోనే తొలిసారి పాకిస్థాన్ బోర్డు అలాంటి ప్రయత్నమే చేయబోతుంది. త్వరలోనే ఆన్‌లైన్ హెడ్ కోచ్‌ను నియమించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇది వరకు తమతో కలిసి పని చేసిన సౌతాఫ్రికా చెందిన మిక్కీ ఆర్థర్‌ను తిరిగి కోచ్‌గా రప్పించేందుకు పాక్ బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
కాగా, 2016 నుంచి 2019 వరకు దాయాది జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. అతడు కోచ్‌గా ఉన్న సమయంలోనే.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీని సర్ఫరాజ్ నేతృత్వంలోని పాక్ జట్టు గెలుపొందింది. అనంతరం శ్రీలంక టీమ్‌కు కోచ్‌గా పగ్గాలు అందుకున్నఅతడు 2021లో ఆ జట్టుకు కూడా గుడ్‌బై చెప్పాడు. అనంతరం ఇంగ్లిష్ కౌంటీ జట్టు డెబ్రీషైర్ హెడ్ క్రికెట్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అయితే ఈ ఇంగ్లిష్ కౌంటీతో అతడికి కాంట్రాక్ట్ 2025 వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థర్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకొని పాకిస్థాన్ కోచ్‌గా తిరిగి వచ్చే అవకాశాలు లేవు. కానీ పీసీబీ మాత్రం అతడినే కోచ్‌గా నియమించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే.. ప్రపంచంలోనే ఏ బోర్డు చేయని విధంగా.. ఆన్‌లైన్ కోచ్‌గా ఆర్థర్‌ను నియమించాలని భావించింది. అలానే ఆర్థర్.. పాక్ టీమ్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు కూడా తీసుకుంటారని తెలుస్తోంది. గ్రాంట్ బ్రాడ్‌బర్న్ అసిస్టెంట్ కోచ్‌గా, రెహాన్ ఉల్ హక్ టీమ్ మేనేజర్‌గా పగ్గాలు అందుకుంటారట.
ఇకపోతే పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న దిగ్గజ స్పిన్నర్ సక్లయిన్ ముస్తక్ కాంట్రాక్ట్ త్వరలోనే ముగియనుంది. పీసీబీ చైర్మన్‌గా రమీజ్ రాజా నియామకం తర్వాత మిస్బా ఉల్ హక్, వకార్ యూనిస్.. కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. 2021 టీ20 వరల్డ్ కప్‌కు ముందు ముస్తక్‌ను ప్రధాన శిక్షకుడిగా ఎంపికయ్యాడు. 2021, 2022 టీ20 వరల్డ్ కప్‌ల సమయంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ పాకిస్థాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించాడు.
ఇదీ చూడండి: ఉందిలే మంచి కాలం.. మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ