ETV Bharat / sports

దాదా ఎంత పని చేశావ్​.. మెగా బ్లాక్​ బస్టర్​ ట్రైలర్ సీక్రెట్​ తెలిసిపోయిందిగా - రోహిత్ రష్మిక మెగా బ్లాక్​ బస్టర్​

ఫ్యాన్స్​ను సస్పెన్స్​లో పడేసిన కెప్టెన్​ రోహిత్​శర్మ, బీసీసీఐ ప్రెసిడెంట్​ గంగూలీ, తమిళ హీరో కార్తి, నేషనల్​ క్రష్​ రష్మిక, దీపిక పదుకొణె మెగా బ్లాక్​ బస్టర్​ ట్రైలర్ సీక్రెట్​​ ఏంటో ముందుగానే తెలిసిపోయింది. అదేంటంటే.

mega block buster trailer
మెగాబ్లాక్​ బస్టర్​ ట్రైలర్​ సీక్రెట్​
author img

By

Published : Sep 3, 2022, 4:45 PM IST

సెప్టెంబర్ 1 నుంచి సోషల్ మీడియాలో ఒకటే చర్చ. రోహిత్​ శర్మ, గంగూలీ, కార్తి, రష్మిక, దీపికా పదుకొణె, త్రిష ఇంతమంది కలిసి ఓకే స్క్రీన్​ షేర్​ చేసుకుంటున్నారా? అసలేంటి ఈ మెగా బ్లాక్ బస్టర్​ ట్రైలర్​? అది సినిమానా లేక సిరీసా అంటూ తెగ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడీ సస్పెన్స్​ ఏంటో ముందే తెలిసిపోయింది.

గతంలో ఎప్పుడూ వినని నిర్మాణ సంస్థ ఓసీమ్ నుంచి తామే ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లుగా ఉన్న మెగా బ్లాక్ బస్టర్ ట్రైలర్​ అంటూ ఓ పోస్ట్​ను ఈ స్టార్స్​ అంతా షేర్​ చేశారు. అప్పటినుంచి నెటిజన్లందరూ దాని గురించే మాట్లాడుకోవడం ప్రారంభించారు. అది సినిమానా లేదా వెబ్ సిరీసా అని తెగ చర్చించుకున్నారు. ఇప్పుడు దాని రహస్యం.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సోషల్​మీడియా టీమ్ చేసిన తప్పిదం కారణంగా బయటపడింది.

మెగా బ్లాక్ బస్టర్ అనేది ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ 'మీషో' ప్రమోషనల్ స్టంట్ అని తేలిపోయింది. వీరంతా దానికోసమే తమ పోస్టర్లను పంచుకున్నారు. అయితే గంగూలీ చేసిన తప్పిదం కారణంగా అదేంటో తెలిసిపోయింది. ప్రమోషనల్ స్టంట్​లో పాల్గొన్న ప్రముఖులు తమ మీషో పేరును బయటపెట్టకూడదంటూ.. కేవలం తమ ఫొటో, ఇంకా బ్లక్​బాస్టర్​ అనే పేరు వచ్చేలా మాత్రమే పోస్టర్ చేయాలంటూ ఓ మెసేజ్​ను ఈ స్టార్స్​కు షేర్ చేసింది. మీషో బ్రాండ్ లేదా హాష్ ట్యాగ్ ఎక్కడా ప్రస్తావించకూడదని చెప్పింది. అయితే గంగూలీ టీమ్​ మాత్రం ఆ మెసేజ్​తో సహా బ్లాక్ బస్టర్​ పోస్టర్​ను యథాతథంగా పోస్ట్ చేసింది. కానీ వెంటనే డిలీట్​ చేసింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. కొంతమంది నెటిజన్లు ముందు షేర్ చేసిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్​ చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఇదీ చూడండి: లవ్​ ఫెయిల్యూర్​ అంటూ ఎమోషనల్​ అయిన జబర్దస్త్​ రోహిణి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.