ETV Bharat / sports

అంతర్జాతీయ క్రికెట్​కు మలింగ గుడ్​బై - టీ20 ప్రపంచకప్

ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లకు గుడ్​బై చెప్పిన శ్రీలంక ఫాస్ట్​ బౌలర్​ లసిత్​ మలింగ.. మంగళవారం అంతర్జాతీయ టీ20లకూ రిటైర్మెంట్​ ప్రకటించాడు. ఈ సందర్భంగా సోషల్​మీడియాలో ప్రకటన చేస్తూ.. భవిష్యత్​లో తమ దేశ యువ క్రికెటర్లకు తన అనుభవాన్ని పంచుతానని చెప్పాడు.

Malinga
మలింగ
author img

By

Published : Sep 14, 2021, 6:27 PM IST

Updated : Sep 14, 2021, 8:23 PM IST

శ్రీలంక వెటరన్​ క్రికెటర్​ లసిత్ మలింగ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. యార్కర్లతో ప్రపంచ ఉత్తమ బ్యాట్స్​మెన్​ను హడలెత్తించిన ఈ పేసర్.. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు మంగళవారం ప్రకటించాడు. ఇదివరకే టెస్టులు, వన్డేలకు గుడ్​బై చెప్పేసిన మలింగ​.. టీ20ల నుంచి కూడా రిటైర్​ అవుతున్నట్లు స్పష్టం చేశాడు.

lasith malinga retirement
లసిత్ మలింగ

2014 టీ20 ప్రపంచకప్​ గెలిచిన శ్రీలంక జట్టుకు మలింగానే కెప్టెన్. వైట్​బాల్​ క్రికెట్ లెజెండ్​గా పేరుగాంచిన మలింగ తన రిటైర్మెంట్​ గురించి సోషల్​మీడియా ద్వారా వెల్లడించాడు.

"నా టీ20 బూట్లకు శాశ్వత విశ్రాంతినిస్తున్నా. ఈ రోజు నుంచి అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నా. నా ప్రయాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. రాబోయే కాలంలో యువ క్రికెటర్లతో నా అనుభవాన్ని పంచుకుంటా."

- లసిత్ మలింగ, శ్రీలంక మాజీ క్రికెటర్

శ్రీలంక జాతీయ జట్టు, ముంబయి ఇండియన్స్​ సహా తాను ఆడిన అన్ని ఫ్రాంఛైజీలు, సహచరులకు మలింగ కృతజ్ఞతలు తెలిపాడు. లంక తరఫున మొత్తంగా 546 వికెట్లు పడగొట్టిన మలింగ.. 2011లోనే టెస్టులకు గుడ్​బై చెప్పాడు. వన్డేలకు 2019లో వీడ్కోలు పలికాడు. టీ20లో 107, వన్డేల్లో 338, టెస్టుల్లో 101 వికెట్లు తీశాడు. ఐపీఎల్​లో​ మలింగ పడగొట్టిన 170 వికెట్లు ఇప్పటికీ రికార్డే!

lasith malinga retirement
ఐపీఎల్​లో మలింగ

టీ20ల్లో అత్యధిక వికెట్లు, రెండు హ్యాట్రిక్​ల ఘనత అతడి సొంతం. వన్డేల్లో మూడు హ్యాట్రిక్​లు సాధించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి:

Last Updated : Sep 14, 2021, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.