6 Balls 6 Sixes Krishna Pandey: క్రికెట్ చరిత్రలో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం అంటే అంతా ఆషామాషీ వ్యవహారం కాదు. అయినప్పటికీ మరోసారి ఈ రికార్డు రిపీట్ అయ్యింది. పుదుచ్చేరి వేదికగా జరుగుతున్న టీ 10 లీగ్‌లో పేట్రియాట్స్ జట్టు ఆటగాడు కృష్ణ పాండే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది ఈ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. చివరిసారిగా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఈ ఫీట్‌ను నమోదు చేయగా.. చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ రికార్డు నమోదైంది.
శనివారం రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కృష్ణ పాండే ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. పేట్రియాట్స్ జట్టు ఇన్నింగ్స్ సమయంలో 6వ ఓవర్‌ను వేయడానికి బౌలర్ నితేష్ ఠాకూర్ వచ్చాడు. ఫ్లిక్ షాట్, హుక్ షాట్ ఇలా అన్ని రకాల షాట్లను ఆడిన కృష్ణ పాండే.. గ్రౌండ్ నలువైపులా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అతడి ఖాతాలో ఆరు బంతులకు ఆరు సిక్సర్ల రికార్డు నమోదైంది. ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలస్యం ఎందుకు మీరు కూడా చూసేయండి మరీ!.
-
6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣
— FanCode (@FanCode) June 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
He has done the unthinkable! #KrishnaPandey shows what's possible with his heart-stirring hits!
Watch the Pondicherry T10 Highlights, exclusively on #FanCode 👉 https://t.co/GMKvSZqfrR pic.twitter.com/jfafcU8qRW
">6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣
— FanCode (@FanCode) June 4, 2022
He has done the unthinkable! #KrishnaPandey shows what's possible with his heart-stirring hits!
Watch the Pondicherry T10 Highlights, exclusively on #FanCode 👉 https://t.co/GMKvSZqfrR pic.twitter.com/jfafcU8qRW6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣
— FanCode (@FanCode) June 4, 2022
He has done the unthinkable! #KrishnaPandey shows what's possible with his heart-stirring hits!
Watch the Pondicherry T10 Highlights, exclusively on #FanCode 👉 https://t.co/GMKvSZqfrR pic.twitter.com/jfafcU8qRW
ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతులు మాత్రమే ఆడిన కృష్ణ పాండే ఏకంగా 12 సిక్సర్లు బాదాడు. మొత్తంగా 83 పరుగులు చేశాడు. అయినప్పటికీ పేట్రియాట్స్ జట్టు ఈ మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. ఇంగ్లండ్ జట్టుపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. 19వ ఓవర్ వేసిన బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ ఈ ఘనతను అందుకున్నాడు. అప్పుడు 12 బంతుల్లోనే అర్ధసెంచరీ సహా.. మొత్తం 16 బంతుల్లో 58 పరుగులు చేశాడు.
ఇవీ చదవండి: అప్పుడు కావాలనే సచిన్‌ను గాయపరిచా: అక్తర్