ETV Bharat / sports

ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేను: కోహ్లీ - virat kohli on chinese dish

స్టార్ బ్యాటర్​​ విరాట్‌ కోహ్లీ తాను తిన్న ఓ వంటకం రుచిని ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. ఆ సంగతులను తెలిపాడు.

Kohli fried rice
ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేను: కోహ్లీ
author img

By

Published : Dec 15, 2022, 9:58 AM IST

Updated : Dec 15, 2022, 12:41 PM IST

స్టార్ క్రికెటర్​ విరాట్‌ కోహ్లీ అంటేనే ఫిట్​నెస్​ కా బాప్​. తాను కోరుకున్న ఆకృతి కోసం కఠినమైన డైట్‌ ఫాలో అవ్వడం, కసరత్తులు చేయడంలో ఎప్పుడూ రాజీపడడు. అయితే, ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్​ తన చిన్ననాటి విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడంటే ఆహార నియమాలు ఉన్నాయి గానీ చిన్నప్పుడు రోడ్డు పక్కన అమ్మే తినుబండారాలను ఇష్టంగా తినేవాడినని తెలిపాడు. చైనీస్‌ వంటకాల గురించి మాట్లాడుతూ తాను తిన్న ఓ వంటకం రుచిని ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు.

"ఓసారి మేం ఒక చైనీస్‌ రెస్టారెంట్‌కు వెళ్లాం. అక్కడున్న వాన్‌ పేరు 'చుక్‌ చుక్‌ మెయిల్‌'. వారు చేసిచ్చిన మాంచో సూప్‌, ఫ్రైడ్‌ రైస్‌ను నేనెప్పటికీ మరచిపోలేను. ఆ చైనీస్‌ వంటకం రుచి మరెక్కడా దొరక్కపోవచ్చు" అంటూ వివరించాడు. ప్రముఖ చెఫ్‌ వికాస్‌ ఖన్నాను తన సొంత రెస్టారెంట్‌ 'వన్‌8 కమ్యూన్‌'కు కోహ్లీ ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ వీడియోను విరాట్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

ఇదీ చూడండి: ధోనీ ఇంటిపక్కనే ఇషాన్ కొత్త హౌస్​!

Last Updated : Dec 15, 2022, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.