ETV Bharat / sports

రొనాల్డోపై కోహ్లీ ఎమోషనల్ పోస్ట్​.. ఏ టైటిల్స్​, ట్రోఫీలు మాకు అక్కర్లేదంటూ.. - రొనాల్డో పై కోహ్లీ ఎమోషనల్​ ట్వీట్​

ఫుట్​బాల్ దిగ్గజం రొనాల్డోను ఉద్దేశిస్తూ స్టార్ క్రికెటర్ కోహ్లీ ఓ ఎమోషనల్​ పోస్ట్ చేశాడు. అది కాసేపట్లోనే ఫుల్ వైరల్​గా మారింది.

Kohli Ronaldo
రొనాల్డోపై కోహ్లీ ఎమోషనల్ పోస్ట్​.. ఏ టైటిల్స్​, ట్రోఫీలు మాకు అక్కర్లేదంటూ..
author img

By

Published : Dec 12, 2022, 12:50 PM IST

స్టార్ క్రికెటర్ కోహ్లీకి ఫుట్​బాల్​ దిగ్గజ ప్లేయర్​ రొనాల్డో అంటే ఎంత ఇష్టమో క్రీడా ప్రేమికులకు తెలిసిన విషయమే. ఇప్పటికే చాలా సార్లు అతడిపై తన అభిమానాన్ని కూడా చాటుకున్నాడు. అయితే ఈ సారి రొనాల్డోను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు విరాట్​.

"క్రీడా రంగానికి నువ్వు చేసిన సేవ ఎనలేనిది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులను అలరించిన తీరు మరువలేనిది.. నువ్వు ఆడుతుంటే అలా చూస్తూ ఉండిపోవడం.. కేవలం నాకే కాదు.. నాలాంటి ఎంతో మంది అభిమానులకు దేవుడిచ్చిన వరం అది. ప్రతి మ్యాచ్‌లోనూ నీ కఠోర శ్రమ, నీ అంకితభావం మాకు కనిపిస్తూనే ఉంటుంది. వందకు వంద శాతం ఆటకు న్యాయం చేయడమే పరమావధిగా భావించగలగడం ఆటగాడికి దక్కిన ఆశీర్వాదం లాంటిది. ప్రపంచంలోని ప్రతి ఆటగాడికి అతడు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అవుతాడు. నా దృష్టిలో అత్యుత్తమ ఆటగాడివి నువ్వే. మా అందరిని ఇంతగా అలరించిన నువ్వు ట్రోఫీ గెలవకపోతేనేం..? టైటిల్‌ సాధించకపోతేనేం? అదేమీ పెద్ద విషయం కానేకాదు. నీ ఆట తీరుతో మా మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న నీ గురించి వర్ణించడానికి ఎలాంటి ట్రోఫీలు, టైటిళ్లు అక్కర్లేదు" అని రాసుకొచ్చాడు

ఫిఫా ప్రపంచకప్‌-2022లో భాగంగా మొరాకో చేతిలో ఓటమితో.. టైటిల్‌ దిశగా సాగాలనుకున్న పోర్చుగల్‌ ఆశలకు గల్లంతయ్యాయి. దీంతో క్వార్టర్‌ ఫైనల్లోనే పోర్చుగల్‌ కథ ముగిసింది. దీంతో ప్రపంచకప్‌ ట్రోఫీ సాధించాలనుకున్న 37 ఏళ్ల రొనాల్డో కల కలగానే మిగిలిపోయినట్లయింది. ఈ పరాజయాన్ని తట్టుకోలేక అతడు కన్నీటిపర్యంతమైన తీరు అభిమానుల చేత కంటతడి పెట్టించింది.

ఇదీ చూడండి: ఇప్పటికే టెస్ట్,​ టీ20 పాయే.. ధావన్ వన్డే కెరీర్​పై డీకే షాకింగ్ కామెంట్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.