దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. రోహిత్, కోహ్లీ, బుమ్రా సహా పలువురు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వగా.. జట్టు పగ్గాలను కేఎల్ రాహుల్‌కు అప్పగించింది. పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. క్రికెట్ విశ్లేషకులు ఊహించిన విధంగానే జమ్ము కశ్మీర్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. స్వదేశంలో జూన్ 9 నుంచి 19 మధ్య ఈ 5టీ20లను ఆడనుంది భారత్.
ఐపీఎల్లో ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు ఉమ్రాన్. ఉమ్రాన్‌తో పాటు పంజాబ్ డెత్ ఓవర్ల స్పషలిస్టు అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. గుజరాత్ కెప్టెన్‌గా అరంగేట్రంలోనే జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చిన హార్దిక్ పాండ్య.. పునరాగమనం చేయనున్నాడు. ఐపీఎల్లో బ్యాట్‌తో సహా కీలక సమయాల్లో బంతితో రాణించాడు హార్దిక్.
టీ20 జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, భువనేశ్వర్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు: ఇంగ్లండ్ పర్యటనలో వాయిదా పడిన ఐదో టెస్టుకు జట్టును ప్రకటించింది బీసీసీఐ. గతేడాది సెప్టెంబర్‌లో కొవిడ్ కారణంగా ఐదో టెస్టు ఐదో టెస్టు వాయిదా పడింది. జులై 1-5 మధ్య భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ కౌంటీల్లో అదరగొట్టిన పుజారా.. టెస్టు జట్టులో పునరాగమనం చేయనున్నాడు.
టెస్టు జట్టు: రోహిత్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రాహుల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, పుజారా, పంత్, జడేజా, అశ్విన్, కేఎస్ భరత్, బుమ్రా, శార్దూల్, సిరాజ్, ఉమేశ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇదీ చూడండి: IPL 2022: బుమ్రా అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా..