ETV Bharat / sports

KL Rahul Fitness : రాహుల్​ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి! ఫిట్​గా లేనప్పుడు అవసరమా? - శాంసన్ 2023 ఆసియా కప్

KL Rahul Fitness : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్​నెస్ సాధించకపోయినప్పటికీ.. అతడిని ఆసియా కప్​నకు ఎంపిక చేయడంపై మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి బీసీసీఐని తప్పుబట్టాడు. ఫిట్​గా లేనివారిని ఎంపిక చేసి.. ఇతర ఆటగాళ్ల అవకాశాన్ని దెబ్బతీయడం ఎందుకని కృష్ణమాచారి ప్రశ్నించాడు.

KL Rahul Fitness
KL Rahul Fitness
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 4:45 PM IST

Updated : Aug 24, 2023, 5:09 PM IST

KL Rahul Fitness : ఆసియా కప్​ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టు ప్రకటన అనంతరం చీఫ్ సెలెక్టర్ అజిత్ ఆగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ప్రెస్​మీట్​లో అగార్కర్​ మాట్లాడుతూ.. జట్టులో కేఎల్​ రాహుల్​కు బ్యాక్​అప్​ ప్లేయర్​గా.. సంజూ శాంసన్​ను 18వ మెంబర్​గా తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. అయితే ఆటగాడు పూర్తి ఫిట్​నెస్ సాధించకపోతే జట్టులో సెలెక్ట్ చేయడం ఎందుకంటూ.. టీమ్ఇండియా మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి బీసీసీఐని ప్రశ్నించాడు.

జట్టు ప్రకటన అనంతరం స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకోలేదని.. అతడు ట్రీట్​మెంట్ తీసుకుంటున్నాడని ఆగార్కర్ తెలిపాడు. అంతేకాకుండా అతడు పాకిస్థాన్​తో జరిగే మ్యాచ్​కు అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొన్నాడు. ఒకవేళ రాహుల్ పూర్తిగా కోలుకోకపోతే.. ఆ స్థానాన్ని శాంసన్​తో భర్తీ చేయడానికే ​అతడిని రిజర్వ్ ఆటగాడిగా తీసుకుంది బీసీసీఐ. ఈ క్రమంలో జట్టు కూర్పుపై.. సెలెక్టర్ల తీరును కృష్ణమాచారి సోషల్​మీడియా వేదికగా తప్పుపట్టాడు. 'గాయంతో ఉన్న ఆటగాడిని ఎలా ఎంపిక చేశారు' అని కృష్ణమాచారి మండిపడ్డాడు.

"ఒకవేళ రాహుల్​ను ప్రపంచకప్​నకు సిద్ధం చేయాలనుకుంటే అది వేరే విషయం. అంతేకానీ ఫిట్​గా లేని అతడిని ఎంపిక చేసి.. మరో ప్లేయర్​కు అన్యాయం చేయడం దేనికి. గతంలో ఒకసారి నేను సెలెక్షన్ కమిటీలో ఉండగా.. 2010లో సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్​ కోసం జట్టును ఎంపిక చేశాం. ఆ సమయానికి వీవీఎస్ లక్ష్మణ్ ఫిట్​గా లేడు. అందుకని అతడిని పక్కన పెట్టి.. యంగ్​ స్టార్ వృద్ధిమాన్ సాహకు అవకాశం ఇచ్చాం. దీంతో సాహా ఆ మ్యాచ్​తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అలా జట్టును ఎంపిక చేసేటప్పుడు కాస్త ఆలోచించాలి" అని కృష్ణమాచారి అన్నాడు.

కాగా 2023 ఐపీఎల్​​లో బెంగళూరుతో మ్యాచ్​ ఆడుతుండగా రాహుల్ గాయపడ్డాడు. అతడు చివరిసారిగా టీమ్ఇండియా తరఫున మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్​లో ఆడాడు.

ఆసియ కప్​నకు ఎంపికైన భారత జట్టు..
Team India 2023 Asia Cup Squad : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్​మన్ గిల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్ పాండ్య, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్​దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ. స్టాండ్‌ బై: సంజూ శాంసన్‌.

Last Updated : Aug 24, 2023, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.