ETV Bharat / sports

పాకిస్థాన్​పై ఆ ఓటమి గుర్తుకొస్తే ఇప్పటికీ నిద్రపట్టదంటున్న కపిల్ - జావేద్​ మియాందాద్

ఆసియా కప్​లో భాగంగా భారత్​ చిరకాల ప్రత్యర్థి పాక్​తో ఆదివారం తలపడనుంది. ఈ నేపథ్యంలో 1986లో పాక్​తో జరిగిన ఓ మ్యాచ్​పై కపిల్ దేవ్​​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క వికెట్​ తేడాతో భారత్​పై పాక్​ గెలుపొందిన సందర్భాన్ని కపిల్​ గుర్తుచేసుకున్నారు.

kapil dev
కపిల్​ దేవ్​
author img

By

Published : Aug 24, 2022, 8:05 PM IST

Kapil Dev Ind vs Pak match: ఆసియా కప్​లో భాగంగా టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో ఆదివారం తలపడనున్నవేళ.. భారత​ మాజీ కెప్టెన్​ కపిల్​దేవ్​ 1986 మ్యాచ్​కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క వికెట్​ తేడాతో 1986 ఆస్ట్రాల్-ఆసియా కప్​ ఫైనల్ మ్యాచ్​​లో పాక్​ చేతిలో భారత్ ఓడిపోవడం గుర్తుకొస్తే ఇప్పటికీ నిద్ర పట్టదని కపిల్ దేవ్​ పేర్కొన్నారు.

"270 పరుగులు చేయవలసిన ఆ మ్యాచ్​లో వసీం అక్రమ్​కు మూడు వికెట్లు తీసినందున టీమిండియా 245 పరుగుల వద్ద ఆగిపోవాల్సివచ్చింది. చివరి ఓవర్లో పాక్​ టార్గెట్​ 13 పరుగులు ఉంది. ఆ సమయంలో అది దాదాపు అసాధ్యం అనుకున్నాము. కానీ అనూహ్యంగా పాక్​ విజయం సాధించింది" అని కపిల్ దేవ్​ తెలిపారు.

"చివరి బంతికి 4 పరుగులు అవసరం కాగా.. చేతన్​ వద్దకు వెళ్లి లోయార్కర్​ వేయమని చెప్పగా అది ఫుల్​టాస్​గా మారింది. దాన్ని మియాందాద్​ సిక్సర్​గా మలిచాడు. మేము ఇప్పటికీ ఆ క్షణంలో చేతన్​ది తప్పుకాదని భావిస్తున్నాము. ఆరోజు గుర్తుకు వచ్చిన ప్రతిసారీ నాకు నిద్రపట్టదు. ఆ ఓటమి మొత్తం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఆ ఓటమి నుంచి కోలుకోవడానికి నాలుగేళ్ల సమయం పట్టింది."
- కపిల్​ దేవ్,​ టీమిండియా మాజీ కెప్టెన్​

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రెండు దేశాల మధ్య కొన్ని సిరీస్​లు ఆగినప్పటికీ.. అభిమానులు మాత్రం భారత్​ -పాక్​ మ్యాచ్​ అంటే ముందుంటారు. భారత్​-పాక్​ల మధ్య గతంలో ఎన్నో చిరస్మరణీయమైన మ్యాచ్​లు జరిగాయి. అయినప్పటికీ 1986 ఆస్ట్రేలియన్-ఆసియా కప్​ ఫైనల్ మ్యాచ్ మాత్రం పాకిస్థాన్​ సాధించిన గొప్ప విజయాలలో ఒకటిగా నిలిపోయింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.