ETV Bharat / sports

వారికి కపిల్ హెచ్చరిక​.. ఆ రిఫరల్​పై ఆలోచించాలన్న గావస్కర్​

author img

By

Published : May 3, 2022, 7:55 AM IST

యువ క్రికెటర్లను దిగ్గజ క్రికెటర్​ కపిల్​దేవ్​​​ హెచ్చరించారు. ఓ సీనియర్​ క్రికెటర్​ పేరును ఉదహరిస్తూ అతనిలా అవ్వొద్దని సూచించారు. కాగా, మరో దిగ్గజం సునీల్​ గావస్కర్ నో బాల్‌ విషయంలో తన అభిప్రాయాన్ని తెలిపారు. దానిపై ఐసీసీ ఆలోచించాలని కోరారు.

kapil dev sunil gavaskar
కపిల్​ దేవ్​ సునీల్​ గావస్కర్​

యువ క్రికెటర్లకు కపిల్‌ సూచన: క్రీడాకారులు తమ ఆటపై దృష్టి సారించకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో వినోద్‌ కాంబ్లీ కెరీర్‌ను టీమ్‌ఇండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ ఉదహరించారు. తాత్కాలిక కీర్తిప్రతిష్టలు, గుర్తింపు కారణంగా ఆటపై దృష్టి కోల్పోకూడదని యువ క్రికెటర్లకు కపిల్‌ సూచించారు. సచిన్‌, వినోద్ కాంబ్లీ పాఠశాల స్థాయిలో అదరగొట్టారు. ఆ తర్వాత 1990ల్లో అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కాంబ్లీ ఆరంభంలో ఓ వెలుగు వెలిగాడు. అయితే ఫామ్‌ కోల్పోయి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక కెరీర్‌ను ముగించాల్సి వచ్చింది. మరోవైపు సచిన్‌ పలు రికార్డులను సృష్టించి మరీ ఉన్నత శిఖరాలకు చేరుకుని రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అండర్‌-19 ప్రపంచకప్‌ ఆటగాళ్లు రాజంగద్‌ బవా, హర్నూర్‌ సింగ్‌తో కలిసి కపిల్‌ దేవ్‌ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడారు. ‘‘ఎప్పుడూ రెండు రకాల క్రికెటర్లు ఉంటారు. నేను సచిన్‌, కాంబ్లీతో ఆడాను. వారిద్దరూ టీమ్‌ఇండియాకు ఎమర్జింగ్‌ ప్లేయర్లుగా మారతారని అప్పుడే అనుకున్నా. వినోద్ కాంబ్లీ ఎంతో కష్టపడి పైకెదిగాడు. అయితే ఆటపై దృష్టిపెట్టాల్సిన సమయంలో ధ్యాస మళ్లింది. దీంతో కెరీర్‌ను అర్ధంతరంగా ముగించాడు. క్రమంగా కీర్తిప్రతిష్టలు దూరమయ్యాయి. ఏది ఏమైనా సరే మీ ప్రదర్శనే ముఖ్యం. బాగా ఆడితే అద్భుత ప్లేయర్‌గా ఎదుగుతారు. లేకపోతే అభిమానులు, ప్రజలు మరిచిపోయిన క్రికెటర్‌గా మారతారు’’ అని కపిల్‌ వివరించారు. కపిల్‌ దేవ్‌ కోచ్‌గా ఉన్నప్పుడు సచిన్‌ టీమ్‌ఇండియాకు నాయకత్వం కూడా వహించాడు.

ఆ రిఫరల్‌పై ఐసీసీ ఆలోచించాలి: టీ20 లీగ్‌లో ప్రతి సంవత్సరం ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారు. ఈ సీజన్‌ కూడా అందుకు మినహాయింపు కాదు. ఈ ఏడాది కొంతమంది యువ పేసర్లు ఆకట్టుకున్నారు. టీ20 లీగ్‌ కొన్ని వేదికలకే పరిమితం కావడంతో క్యురేటర్లు పిచ్‌లపై కాస్త గడ్డి వదులుతుండడంతో బంతి పేసర్లకు సహకరిస్తోంది. దీంతో విజృంభిస్తున్న పేసర్లు బ్యాటర్లకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. అయితే నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేయగలిగే ఈ ఫార్మాట్లో వారి ప్రదర్శనను అంచనా వేసే ముందు ఎర్ర బంతితో రోజుకు 15-20 ఓవర్లు వేస్తే వారి ఫిట్‌నెస్‌ ఎలా ఉందో గ్రహించవచ్చు.

ఈ సీజన్లో చాలా మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. ఇలాంటి సందర్భాల్లో అంపైర్ల నిర్ణయాలు తమకు అనుకూలంగా లేకపోతే భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టం. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో అంపైర్‌ నోబాల్‌ ఇవ్వకపోవడంతో దిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ తమ బ్యాటర్లను పెవిలియన్‌కు వచ్చేయమని సంజ్ఞ చేయడం ఈ కోవకు చెందిందే. ఈ చర్యకు అతడికి మ్యాచ్‌ ఫీజులో వందశాతం కోత పడింది. ఇలాంటి సందర్భాల్లో బంతి ఎంత ఎత్తులో వచ్చిందో తెలుసుకోవడం కోసం ఒక రిఫరల్‌ ఉంటే బాగుంటుంది. కానీ అది అంపైర్‌ చేతుల్లోనే ఉండాలి.

దీనికో ఉదాహరణ ఏంటంటే ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్‌ జట్టు గెలవాలంటే చివరి బంతికి నాలుగు పరుగులు చేయాలి. బంతి ప్యాడ్‌కు తగిలి బౌండరీకి వెళితే ఫీల్డింగ్‌ జట్టు ఎల్బీకి అప్పీల్‌ చేసినప్పుడు బంతి డెడ్‌ కావడంతో ప్యాడ్‌కు తగిలి బౌండరీకి వెళ్లినా అది లెక్కలోకి రాదు. ఒకవేళ బ్యాటర్‌ నాటౌట్‌ అని సమీక్షలో తేలినా.. ఆ బంతి డాట్‌ బాల్‌ కావడంతో ఫోర్‌ లెగ్‌బైస్‌ ఇవ్వరు ఫలితం.. ఫీల్డింగ్‌ జట్టే గెలుస్తుంది. ఏదైనా పెద్ద టోర్నీలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నాకౌట్‌ మ్యాచ్‌లోనే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎంతటి రగడ జరుగుతుందో ఊహించొచ్చు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఐసీసీ క్రికెట్‌ కమిటీ త్వరలో సమావేశమై రిఫరల్‌పై ఒక నిర్ణయం తీసుకోవాలి.

ఇదీ చూడండి: Chess Olympiad: చదరంగ యుద్ధానికి సైన్యమిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.